ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. డైరెక్టర్​ ఫ్యామిలీలో ముగ్గురు సజీవదహనం!

author img

By

Published : Oct 5, 2022, 2:15 PM IST

agra hospital fire accident

రోగులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బిల్డింగ్​ రెండో అంతస్తులో నిద్రిస్తున్న ఆ ఆస్పత్రి డైరెక్టర్​, అతడి కుమారుడు, కుమార్తె సజీవదహనమయ్యారు. ఈ దుర్ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో జరిగింది.

ఆస్పత్రిలో చెలరేగుతున్న మంటలు

ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. షాగంజ్​ ప్రాంతంలో ఉన్న మధురాజ్​ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆస్పత్రి డైరెక్టర్​ రాజన్​, ఆయన కుమార్తె షాలు, కుమారుడు రిషి సజీవదహనమయ్యారు.

అసలేం జరిగిందంటే?
ఆగ్రాలో జిగ్నేర్​ రోడ్డులో ఉన్న మధురాజ్​ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు.. ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పోలీసులకు, ఫైర్​ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఆస్పత్రికి వద్దకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఆస్పత్రి మొదటి అంతస్తులో చిక్కుకున్న రోగులు, ఆస్పత్రి సిబ్బందిని బయటకు తీసుకొచ్చి వేరే ఆస్పత్రిలో చేర్చారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని పోలీసులు తెలిపారు.

fire breaks out in hospital
కాలిపోయిన ఆస్పత్రి భవనం

బిల్డింగ్​ రెండో అంతస్తులో ఆస్పత్రి డైరెక్టర్​ రాజన్​ తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. మంటలు ఎగిసిపడిన సమయంలో అతడి కుటుంబం నిద్రిస్తోంది. పొగలు విపరీతంగా అలుముకోవడం వల్ల రాజన్​ కుటుంబసభ్యులు బయటకు రాలేకపోయారు. దీంతో రాజన్​, ఆయన కుమారుడు, కుమార్తె సజీవదహన మయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంటలు చెలరేగడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: నవమి రోజున జాక్​పాట్​.. ఒక్క వజ్రంతో రాత్రికిరాత్రే లక్షాధికారిగా..

సైబర్ నేరగాళ్లపై సీబీఐ కొరడా.. 105 ప్రదేశాల్లో సోదాలు.. ఇంటర్​పోల్ సమాచారంతో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.