'దేనికైనా ఓ హద్దు ఉంటుంది'.. న్యాయమూర్తుల్ని 'టార్గెట్' చేయడంపై సుప్రీం అసహనం

author img

By

Published : Jul 28, 2022, 6:08 PM IST

SC on target of Judges

కేసుల విచారణలో జాప్యంపై మీడియాలో ప్రచురితమైన కొన్ని కథనాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు. విచారణ విషయంలో న్యాయమూర్తులను విమర్శించడానికి ఒక హద్దు ఉండాలని అన్నారు.

కేసుల విచారణ విషయంలో న్యాయమూర్తులను విమర్శించడానికి ఒక హద్దు ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. క్రైస్తవ సంస్థలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసును.. జడ్జీలు విచారణకు తీసుకోవడం లేదంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆయన ప్రస్తావించారు. "నేను కరోనాతో బాధపడుతూ సెలవు తీసుకున్నా. అందువల్ల ఆ కేసు వాయిదా పడింది. కానీ న్యాయమూర్తులు కేసును తీసుకోవడం లేదంటూ మీడియాలో వచ్చిన వార్తలు చూశా. కానీ మమ్మల్ని టార్గెట్ చేయడానికీ ఒక హద్దు ఉండాలి" అని ఆయన అన్నారు. దేశంలో క్రైస్తవుల మీద దాడులు, హింస పెరిగిపోతున్నాయని వాటిని అడ్డుకోవాలంటూ బెంగళూరు ఆర్చ్‌బిషప్ డాక్టర్ పీటర్ మచాదో సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. ఈనెల 15న ఈ కేసు విచారణకు రావాల్సి ఉంది. కానీ ధర్మాసనంలోని న్యాయమూర్తులు లేకపోవడం వల్ల వాయిదా పడింది.

దేశవ్యాప్తంగా ప్రతి నెలా క్రైస్తవ సంస్థలపై సుమారు 45-50 దాడులు జరుగుతున్నాయని సీనియర్​ న్యాయవాది కొలిన్​ గోన్​సాల్వేస్​ బెంచ్​ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై 2018లో వేగవంతమైన విచారణలు, బాధితులకు పరిహారం అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. నేరాల నివారణకు నోడల్​ అధికారులను నియమించాలని తెలిపింది. గోహత్య, ద్వేషపూరిత నేరాలను మొగ్గలోనే తుంచివేయాలని కోర్టు పేర్కొంది.

ఇవీ చదవండి: బంగాల్​ మంత్రి పార్థాపై వేటు- ఆ డబ్బంతా ఆయనదే!

చెన్నై 'చెస్ ఒలింపియాడ్' నుంచి పాక్ ఔట్.. 'అంతా రాజకీయం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.