అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. నేడు సీబీఐ వాదనలు

author img

By

Published : May 26, 2023, 12:12 PM IST

Updated : May 27, 2023, 6:38 AM IST

MP Avinash Reddy Bail Petition Enquiry

MP Avinash Reddy Anticipatory Bail Petition: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై.. తెలంగాణ హైకోర్టు శనివారం తేల్చేసే అవకాశం ఉంది. అవినాష్‌రెడ్డి, సునీత తరపు వాదనలు విన్న న్యాయస్థానం.. సీబీఐ వాదనలు వినేందుకు విచారణను శనివారానికి వాయిదా వేసింది. కస్టడీ విచారణకు.. సీబీఐ చెప్పే కారణాలు సరికాదని అవినాష్‌ తరపు న్యాయవాది ఆక్షేపించగా..అవినాష్‌రెడ్డి శక్తిమంతుడని, అమాయక ఎంపీ కాదని సునీత అభ్యంతరం తెలిపారు.

MP Avinash Reddy Anticipatory Bail Petition: వివేకా హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. విచారణ ప్రారంభం కాగానే అవినాష్ తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. అవినాష్ నిందితుడని రికార్డుల్లో.. సీబీఐ ఎక్కడా చెప్పలేదని వాదించారు. గుండెపోటు అన్నంత మాత్రాన నేరం చేసినట్లే అనడం సరికాదని,.. అవినాష్ వైద్యుడో, పోలీసు అధికారో కాదు కదా అని న్యాయవాది ప్రశ్నించారు.

వివేకాకు A-1 ఎర్ర గంగిరెడ్డితో భూవివాదాలు ఉన్నాయని,.. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డితో వజ్రాల వ్యాపారంలో.. గొడవలు ఉన్నాయని చెప్పారు. దస్తగిరి తీసుకున్న కోటి రూపాయల్లో 46.70 లక్షలే రికవరీ చేశారని.. మిగతా సొమ్ము ఏమైందో సీబీఐ చెప్పడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో... వివేకా ఓటమి, ఎంపీ టికెట్‌ విషయంలో అవినాష్‌ను.. సీబీఐ అనుమానిస్తోందన్నారు. వివేకాను హత్య చేసిన దస్తగిరిని సీబీఐ వెనుకేసుకొస్తోందని, అతడి ముందస్తు బెయిల్​ను సీబీఐ వ్యతిరేకించలేదని అవినాష్ న్యాయవాది.. హైకోర్టుకు నివేదించారు.

ఎర్ర గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్‌పై కోర్టుకు వెళ్లిన సునీత.. దస్తగిరి బయట తిరుగుతుంటే స్పందించడంలేదని.. అవినాష్‌రెడ్డి న్యాయవాది ఆక్షేపించారు. సుదీర్ఘంగా అవినాష్ న్యాయవాది వాదనలు వినిపిస్తుండగా.. వాదనల్లో వేగం పెంచాలని హైకోర్టు సూచించింది. అవినాష్​కు ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని ఇప్పటికే కౌంటర్ వేసిన సీబీఐ.. తాజా పరిణామాలతో అనుబంధ కౌంటర్ దాఖలు చేసింది. శనివారం కూడా వాదనలు కొనసాగించాలని సునీత తరఫు న్యాయవాది కోరారు. ఈరోజే విచారణ పూర్తి చేస్తామని.. అందరూ అంగీకరిస్తే మాత్రం వేసవి సెలవుల తర్వాత వింటామని న్యాయమూర్తి చెప్పారు. ఈరోజే కొనసాగించాలని.. అవినాష్​కు కేటాయించినంత సమయం తమకూ ఇవ్వాలని సునీత కోరారు. అవినాష్ తరపు న్యాయవాది వాదనలు ముగిశాక.. సునీత తరపు న్యాయవాది వాదనలను.. న్యాయమూర్తి విన్నారు.

సీబీఐ కౌంటర్​ పిటిషన్​లో..: వివేకా హత్య మిస్టరీలో.. సీబీఐ మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. హత్య విషయం.. బాహ్య ప్రపంచానికన్నా ముందే జగన్​కు తెలిసినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్​పై విచారణ సందర్భంగా.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ ఈ మేరకు.. అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. వివేకా పీఏ.. కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే హత్య విషయం జగన్​కు తెలుసని స్పష్టం చేసింది. జగన్​కు అవినాష్ రెడ్డే చెప్పారా అనేది దర్యాప్తు చేయాల్సి ఉందని.. అఫిడవిట్​లో పేర్కొంది.

ఇవీ చదవండి:

Last Updated :May 27, 2023, 6:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.