ఆలయంలో అద్భుతం- శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

author img

By

Published : Jan 14, 2022, 9:02 PM IST

Sun Rays fall on the Shivalingam

Sun Rays fall on the Shivalingam: సంక్రాంతి సందర్భంగా బెంగళూరు గంగాధరేశ్వర ఆలయంలోని శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరించాయి. 2 నిమిషాల 13 సెకన్ల పాటు కిరణాలు కనువిందు చేశాయి. ఈ సమయంలో ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

శివుడిపై సూర్యకిరణాలు

Gavi Gangadhareshwara Temple: మకర సంక్రాంతి సందర్భంగా కర్ణాటక బెంగళూరులోని గావి గంగాధరేశ్వర మందిరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సంధ్యావేళ సూర్యకిరణాలు గుడిలోని శివలింగాన్ని స్పృశించాయి. చీకటి గుహలో వెలుతురు నింపుతూ సూర్య కిరణాలు నంది చెవుల మధ్యలో నుంచి సూర్యుడిపై పడ్డాయి. 2 నిమిషాల 13 సెకన్ల పాటు రవి కిరణాలు కనువిందు చేశాయి.

Sunshine fall on shivalingam

సూర్యకిరణాలు శివలింగాన్ని తాకిన సమయంలో ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు, కొబ్బరి నీరు, పవిత్ర జలంతో శివలింగానికి అభిషేకం నిర్వహించారు. అయితే, కరోనా ఆంక్షల వల్ల ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులకు అనుమతి లభించలేదు.

మందిర నిర్మాణ శైలి కారణంగా ప్రతి ఏటా ఇదే రోజు సూర్య కిరణాలు శివలింగంపై ప్రసరిస్తాయి. గతేడాది మాత్రం శివలింగంపై కిరణాలు పడలేదు. గడిచిన యాభై ఏళ్లలో ఇలా జరగడం అదే తొలిసారి. మబ్బులు అధికంగా ఉండటమే ఇందుకు కారణం. అయితే, శివలింగం ఉన్న ప్రాంతం భూగర్భంలో 15 మీటర్ల లోతులో ఉండటం విశేషం.

ఇదీ చదవండి: శబరిమల 'మకరజ్యోతి' దర్శనం- భక్తజనం పరవశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.