అయోధ్యలో 251మీటర్ల రాముడి ప్రతిమ.. ఐక్యతా విగ్రహాన్ని మించి..

author img

By

Published : Sep 20, 2022, 11:59 AM IST

Shri Ram statue in ayodhya

గుజరాత్​లోని ఐక్యతా విగ్రహం కన్నా ఎత్తుగా.. అయోధ్యలో శ్రీరాముడి ప్రతిమ ఏర్పాటు కానుంది. ప్రముఖ శిల్పి, పద్మభూషణ్ గ్రహీత రామ్​.వి.సుతార్.. ఈ విగ్రహాన్ని రూపొందించనున్నారు. అయోధ్యలో భూమి కొనుగోలు ప్రక్రియ పూర్తికాగానే.. పనులు ప్రారంభం కానున్నాయి.

Ayodhya Ram statue height : ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలో ఏర్పాటు కానున్న 251 మీటర్ల శ్రీరాముడి ప్రతిమ.. ప్రపంచంలోనే అత్యంత విగ్రహం కానుంది. రామజన్మభూమిలో కొత్తగా నిర్మితమవుతున్న రామాలయం దర్శనానికి వచ్చే వారిని మంత్రముగ్ధుల్ని చేయనుంది. గుజరాత్​ కేవడియాలోని సర్దార్​ పటేల్ ఐక్యతా విగ్రహం రూపశిల్పి, పద్మభూషణ్ గ్రహీత రామ్​.వి.సుతార్​.. రాముడి ప్రతిమ సృష్టికీ సారథ్యం వహించనున్నారు. లతా మంగేష్కర్​ చౌక్ అభివృద్ధి పనుల కోసం.. కుమారుడు అనిల్​తో కలిసి ప్రస్తుతం అయోధ్యలో ఉన్న సుతార్​తో ఈటీవీ భారత్​ ప్రత్యేకంగా మాట్లాడింది.

Shri Ram statue in ayodhya
అయోధ్యలో 251మీటర్ల రాముడి ప్రతిమ నమూనా

రామ్​.వి.సుతార్​ చెప్పినదాని ప్రకారం.. అయోధ్యలో ఏర్పాటు కానున్న రాముడి విగ్రహం 251 మీటర్లు ఎత్తు ఉండనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా ఉన్న పటేల్ 'స్టాచ్యూ ఆఫ్​ యూనిటీ'(182 మీటర్లు) కన్నా ఇది 69 మీటర్లు పెద్దది.
సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ విగ్రహం రూపకల్పన కోసం 1000 మంది శిల్పులు మూడున్నర ఏళ్లపాటు శ్రమించారు. అయోధ్యలోని రాముడి ప్రతిమ కోసం 2వేల మంది దాదాపు నాలుగేళ్ల పనిచేయాల్సి ఉంటుందని అంచనా వేశారు రామ్ సుతార్ కుమారుడు అనిల్ సుతార్. సాహిబాబాద్​లోని తమ కార్ఖానాలో విగ్రహం తయారీ పనులు చేపడతామని వెల్లడించారు.

Statue of Sardar Vallabhbhai Patel
ఐక్యతా విగ్రహం వద్ద శిల్పులు

రాముడి విగ్రహం ఏర్పాటుకు 2018లోనే ఉత్తర్​ప్రదేశ్​లోని యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. సుతార్ బృందం రూపొందించిన మోడల్​ను ఆమోదించింది. అయోధ్యలో విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించి, భూమి కొనుగోలు ప్రక్రియ పూర్తికాగానే.. శంకుస్థాపన చేసి, నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు అనిల్.
మరోవైపు.. ముంబయిలో 212 మీటర్లు ఎత్తయిన ఛత్రపతి శివాజీ విగ్రహం, 137.2 మీటర్ల అంబేడ్కర్​ ప్రతిమ; కర్ణాటకలో 46.6 మీటర్ల శివుడి విగ్రహానికి సంబంధించిన ప్రాజెక్టులపైనా సుతార్ బృందం పనిచేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.