మతిస్థిమితం సరిగాలేని బాలికపై గ్యాంగ్​ రేప్​

author img

By

Published : Jan 11, 2022, 11:25 AM IST

Gang rape

Sexual assault cases: మానసిక స్థితి సరిగాలేని బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. మరో కేసులో పాఠశాలకు వెళ్తున్న బాలికను అపహరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ వ్యక్తి. ఈ సంఘటనలు కర్ణాటకలో వెలుగు చూశాయి.

Sexual assault cases: కర్ణాటక కలబురిగిలో దారుణ ఘటన జరిగింది. మతిస్థిమితం సరిగా లేని ఓ బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జనవరి 5న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఐదుగురు దుండగులు అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు.. విశ్వవిద్యాలయ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

శివమొగ్గ జిల్లాలో మరో ఘటన

శివమొగ్గ జిల్లా భద్రావతిలో ఉన్నత పాఠశాల విద్యార్థినిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. గత సోమవారం బాలిక పాఠశాలకు వెళ్తున్న క్రమంలో.. కారులో వచ్చిన దుండగుడు ఆమెను అపహరించి అఘాయిత్యం చేశాడు.

నగరంలోని పేపర్​ టౌన్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. బాధితురాలిని జిల్లా కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

ఇదీ చూడండి: మహిళపై సామూహిక అత్యాచారం.. మెడికల్​ షాప్​కు వెళ్తే.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.