Temple for Mother: అమ్మపై ప్రేమ.. రూ.10 కోట్లతో గుడి

author img

By

Published : May 14, 2023, 10:41 AM IST

mother temple

Srikakulam district resident is washing a temple for his mother: భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సంస్కృతి, నాగరికతను పరిగణలోకి తీసుకొని, పంచగోపురాలతో తన తల్లి ప్రేమ కోసం ఓ కుమారుడు గుడిని నిర్మిస్తున్నారు. అమ్మతత్వాన్ని, ఆమె ప్రేమను రానూరానూ కరుమరుగైపోతున్న ఈ రోజుల్లో అమ్మ దేవాలయాన్ని ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. గుడి నిర్మాణం చేపట్టడానికి గల కారణాలు, గుడి కోసం ఖర్చు చేస్తున్న వ్యయంతోపాటు పలు కీలక విషయాలను ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.

అమ్మ కోసం రూ.10 కోట్లతో గుడి

Temple for his Mother: అమ్మ గురించి, ఆమె బిడ్డలపై చూపించే ప్రేమ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. మనకు బాధ కలిగితే ఆమె కన్నీరు పెట్టుకుంటుంది. మనం సంతోషపడితే ఆమె ఆనందం ఆకాశాన్ని తాకుతుంది. ఎంతటి కష్టానైనా ఓర్చుకొని.. బిడ్డల బాగు కోసం తపించే అమృతమూర్తి అమ్మ. పిల్లల కోసం అవలీలగా ప్రాణాలను సైతం ఇచ్చేసే గొప్ప త్యాగమూర్తి అమ్మ. బిడ్డల భవిష్యత్తును బంగారంలాగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమించే శ్రమజీవి అమ్మ. అంతటి ప్రేమ చూపే అమ్మ కోసం ఎంత చేసినా మనసు తృప్తి చెందదు. అటువంటి అమ్మ ప్రేమను తరతరాలకు చాటేలా.. ఓ కొడుకు ముందుడుగులు వేస్తున్నాడు. తన తల్లి కోసం ఓ గుడిని నిర్మిస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరీ ఇంతకీ ఎవరా ఆ వ్యక్తి..? ఎన్ని కోట్లుపెట్టి గుడిని నిర్మిస్తున్నారు..? అనే తదితర విషయాలపై ప్రత్యేక కథనం.

రూ.10కోట్లతో మందిర నిర్మాణం.. వరాలిస్తాడని.. కోరిన కోర్కెలు తీరుస్తాడానే నమ్మకంతో.. దేవుడికి గుడి కట్టి పూజిస్తాము. అలాంటిది అడగకుండానే అన్ని తీర్చే అమ్మకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకున్నా తక్కువే అవుతుంది. అయితే, ఆ రుణంలో ఎంతో కొంత తీర్చుకోవాలనే తపనతో.. అమ్మకున్న ఉన్నత స్థానాన్ని, విలువను మరింత గొప్పగా చాటి చెబుతున్నారు.. శ్రీకాకుళం జిల్లా చీమలవలసకు చెందిన సనపల శ్రావణ్ కుమార్. అమ్మను దేవతగా భావించి ఆమెకు గుడికట్టాలని నిర్ణయించుకున్నారు. సాదాసీదాగా ఒక చిన్న మండపం కట్టి. అందులో విగ్రహం పెట్టడం కాకుండా.. ఏకంగా రూ.10 కోట్ల రూపాయల వ్యయంతో ఏకకృష్ణ శిలతో అద్భుతంగా మందిర నిర్మాణం చేపట్టారు. బిడ్డల్నీ కన్న తల్లిదండ్రులను కావడిలో మోసిన ఆనాటి శ్రవణుడి కథను.. వాల్మీకి రాసిన రామాయణంలో విన్నాము. అమ్మపై ప్రేమకు కొత్త అర్థాన్నిస్తున్న అభినవ శ్రావణుడి కథే ఇది.

శస్త్రచికిత్స వికటించి తల్లి మృతి.. శ్రావణ్ కుమార్ తండ్రీ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తల్లి అనసూయాదేవి గృహిణి. వీరికి తొలుత కవల పిల్లలు పుట్టారు. వారిలో ఒకరు పుట్టిన వెంటనే చనిపోగా.. మరొకరు 9వ ఏట క్యాన్సర్ తో మృతిచెందారు. తర్వాత పుట్టిన శ్రావణకుమార్‌ని తల్లి అల్లారుముద్దుగా పెంచింది. శ్రావణకుమార్‌కు సైతం తల్లి అంటే ఎంతో గౌరవం.. ప్రేమ. ఆమె ప్రోత్సాహంతోనే చదువుకొని.. హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారిగా స్థిరపడ్డారు. 2008లో తల్లికి శస్త్రచికిత్స వికటించి మృతి చెందడాన్ని శ్రావణకుమార్ జీర్ణంచుకోలేకపోయారు. అప్పటినుంచి ఆమె జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. తన తల్లిపై ఉన్న ప్రేమను చాటేందుకు అమ్మదేవస్థానం కట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో తన సొంతూరు అయినా చీమలవలసలోనే 2019వ సంవత్సరం మార్చి మాసంలో గుడి నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు.

గుడి నిర్మాణం వివరాలు.. యాదాద్రి ఆలయ నిర్మాణ స్తపతుల్లో ఒకరైన బలగం చిరంజీవి, తమిళనాడుకు చెందిన శిల్పి పాండీదురై, ఒడిశాకు చెందిన శిల్పకారులు సురేష్‌ బృందం ఆధ్వర్యంలో గుడి నిర్మిస్తున్నారు. ఆలయంలోని ప్రధాన గోపురాన్ని 51 అడుగులు ఎత్తుతో ఉంచి పంచగోపురాలను నిర్మాణాన్ని చేపట్టారు. అనంతరం మూలవిరాట్టుగా మాతృమూర్తి విగ్రహాన్ని, శిలలపై ప్రాచీన నగిషీలతో శిల్పకళ ఉట్టిపడేలా కట్టడాలు నిర్మిస్తున్నారు. అమ్మ ప్రేమ గొప్పతనంపై చేయించిన చిత్రాలను గుడి మండప స్తంభాలపై చెక్కుతున్నారు. అంతేకాకుండా, అమ్మ దేవస్థానం నిర్మాణానికి సంబంధించిన కృష్ణ శిలలను బాపట్ల జిల్లా మార్టూరు నుంచి తీసుకొస్తున్నారు.

ఆమె ప్రేమను విశ్వవ్యాప్తం చేస్తాను.. అమ్మ ప్రేమను విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతోనే తన తనయుడు ఆలయ నిర్మాణాన్ని చేపట్టారని శ్రావణ్ కుమార్ తండ్రి కృష్ణారావు చెబుతున్నారు. పూర్తిగా ఏకకృష్ణ శిలతో.. ఆలయ పునాది నుంచి శిఖరం అంచుల వరకు నిర్మితమవుతున్న అమ్మ దేవస్థానం పనులు ప్రస్తుతం 70శాతం పూర్తయ్యాయి. మరో రెండేళ్లలో పూర్తిస్థాయిలో గుడి అందుబాటులోకి రానుంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.