Up Elections: ఆప్​తో ఎస్పీ పొత్తు- టార్గెట్ భాజపా!

author img

By

Published : Nov 24, 2021, 8:08 PM IST

Samajwadi Party in up elections, sp and aap alliance

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సమాజ్​వాదీ పార్టీ(Aap and sp alliance) సిద్ధమవుతోంది. బుధవారం ఆప్​ నేత సంజయ్ సింగ్​తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్​ సమావేశమయ్యారు. ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి చర్చలు(Akhilesh alliance) జరిపారు.

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో(Up election 2022) ఉత్తర్​ప్రదేశ్​లో భాజపాను గద్దె దించి.. అధికారాన్ని చేపట్టే లక్ష్యంతో సమాజ్​ వాదీ పార్టీ(ఎస్పీ) పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే వివిధ పార్టీలతో ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై(Samajwadi party alliance in 2022) సంప్రదింపులు జరుపుతోంది. బుధవారం ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఉత్తర్​ప్రదేశ్​ ఇన్​ఛార్జ్​ సంజయ్ సింగ్​తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్​ లఖ్​నవూలో సమావేశం అయ్యారు. ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి చర్చలు జరిపారు. ఈ భేటీ అనంతరం ఎస్పీతో పొత్తుపై సంప్రదింపులు జరుగుతున్నాయని సంజయ్ సింగ్​ వెల్లడించారు.

"ఉత్తర్​ప్రదేశ్​ను అవినీతి రహితంగా మార్చడానికి, శాంతి భద్రతలను కాలరాసిన ప్రభుత్వాన్ని తొలగించడానికి చేపట్టాల్సిన ఉమ్మడి ఎజెండాపై వ్యూహాత్మక చర్చ జరిగింది. ఎస్పీతో పొత్తుకు సంబంధించి ఇప్పుడే చర్చలు ప్రారంభమయ్యాయి. నేడు జరిగిన భేటీలో ఓ అర్థవంతమైన చర్చ జరిగింది. త్వరలోనే దీని గురించి ప్రకటిస్తాం."

- సంజయ్ సింగ్​, ఉత్తర్​ప్రదేశ్​ ఆప్​ ఇన్​ఛార్జ్​.

మరోవైపు.. బుధవారం అప్నా దళ్​(కె) పార్టీ అధ్యక్షురాలు కృష్ణ పటేల్​తోనూ అఖిలేశ్​ యాదవ్​(Akhilesh alliance) సమావేశమయ్యారు. తాము ఎస్పీతో కలిసి పోటీ చేయనున్నట్లు ఈ సమావేశం అనంతరం కృష్ణ పటేల్ ప్రకటించారు. సీట్ల పంపకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఒకే తరహా సిద్ధాంతాలు ఉన్న ఇతర పార్టీలను తమతో కలుపుకునేందుకు సిద్ధమేనని పేర్కొన్నారు.

రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్​ఎల్​డీ)​ అధ్యక్షుడు జయంత్ చౌదరీతో మంగళవారం సమావేశమైన అఖిలేశ్​ యాదవ్​.. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.

యూపీపై ఆప్​ గురి..

దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ-ఆప్‌... ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు అవకాశాల కోసం చూస్తోంది. ఇప్పటికే పంజాబ్‌లో బలమైన రాజకీయపక్షంగా గుర్తింపుపొందిన ఆప్‌.. ఇప్పుడు అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌పై కన్నేసింది. ఇందులో భాగంగానే ఎస్పీతో పొత్తుకు సముఖతతో ఉంది.

'వారికి రూ.25 లక్షలు అందిస్తాం'

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను అఖిలేశ్ యాదవ్​ మొదలుపెట్టారు. రానున్న ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి వస్తే.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని ట్విట్టర్ వేదికగా ​ప్రకటించారు.

"రైతు జీవితం వెలకట్టలేనిది. ఎందుకంటే.. ఇతరుల ఆకలి తీర్చేందుకు రైతు శ్రమిస్తాడు. 2022లో యూపీలో మేం అధికారంలోకి వస్తే... వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు అందిస్తాం"అని అఖిలేశ్​ తెలిపారు.

ఇదీ చూడండి: UP election 2022: ఎన్నికల వేడి- ఊపందుకున్న విగ్రహ రాజకీయాలు

ఇదీ చూడండి: అప్పుడు కుస్తీ.. ఇప్పుడు దోస్తీ: బాబాయ్‌ పార్టీతో పొత్తుకు అఖిలేశ్‌ రెడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.