'క్రిప్టో కరెన్సీ అలాంటి వారి చేతుల్లోకి చేరకుండా చూడాలి'

author img

By

Published : Nov 18, 2021, 9:54 AM IST

Updated : Nov 18, 2021, 11:37 AM IST

Prime Minister Narendra Modi

సిడ్నీ డైలాగ్​లో(sydney dialogue) వర్చువల్​గా హాజరై కీలక ప్రసంగం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM modi news). సాంకేతిక రంగంలో భారత్​ అభివృద్ధి చెందుతున్న తీరును వివరించారు. భద్రత, శ్రేయస్సు కోసం భాగస్వామ్య దేశాలతో కలిసి పని చేసేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. క్రిప్టో కరెన్సీ(cryptocurrency) తప్పుడుమార్గంలో వెళ్లేవారి చేతుల్లోకి రాకుండా చాడాలని ప్రజాస్వామ్య దేశాలకు పిలుపునిచ్చారు.

భారత్​, ఆస్ట్రేలియాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, తమ ప్రాంతంతో పాటు ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుందని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news). ఇండియాస్​ టెక్నాలజీ ఎవల్యూషన్​ అండ్​ రెవల్యూషన్(digital technology)​ అనే అంశంపై సిడ్నీ డైలాగ్​లో(sydney dialogue) వర్చువల్​గా హాజరై కీలక ప్రసంగం చేశారు. సాకేంతిక రంగంలో భారత్​ ఎదిగిన తీరును వివరించారు. క్రిప్టో కరెన్సీ(cryptocurrency) తప్పుడు మార్గంలో వెళ్లేవారి చేతుల్లోకి చేరకుండా చూసేందుకు ప్రజాస్వామ్య దేశాల కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అది మన యువతను నాశనం చేస్తుందని హెచ్చరించారు.

సిడ్నీ డైలాగ్​లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

"ఎప్పుడో ఒకసారి జరిగే మార్పుల కాలంలో మనం ఉన్నాం. మన చుట్టూ ఉన్న అన్నింటినీ డిజిటల్​ వ్యవస్థ మార్చేస్తోంది. రాజకీయాలు, ఆర్థికం, సమాజాన్ని పునర్నిర్వచించింది. సార్వభౌమత్వం, పరిపాలన, విలువలు, న్యాయం, హక్కులు, భద్రత వంటి అంశాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. అంతర్జాతీయ పోటీతత్వం, అధికారం, నాయకత్వాన్ని మార్చివేసింది. ఇది పురోగతి, శ్రేయస్సు కోసం అవకాశాల కొత్త శకానికి నాంది పలికింది. కానీ, కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. సముద్రాల నుంచి సైబర్​, అంతరిక్షం వరకు కొత్త ముప్పులు తలెత్తాయి. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

అంతర్జాతీయ పోటీలో, భవిష్యత్తులో సరిహద్దులను గుర్తించేందుకు సాంకేతికత(digital technology) ప్రధాన సాధనమని తెలిపారు మోదీ. టెక్నాలజీ, డేటా సరికొత్త ఆయుధాలుగా నిలుస్తాయన్నారు. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద బలం నిష్కపటమని, అయితే, స్వార్థ ప్రయోజనాల కోసం దానిని దుర్వినియోగం చేయడానికి అనుమతించకూడదని సూచించారు.

కలిసి పని చేసేందుకు సిద్ధం..

ప్రజాస్వామ్యం, డిజిటల్​ రంగంలో(digital technology) లీడర్​గా భారత్​.. తమ భద్రత, శ్రేయస్సు కోసం భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు మోదీ. భారత డిజిటల్​ విప్లవం ప్రజాస్వామ్యం, ప్రజలు, ఆర్థిక వ్యవస్థ స్థాయిలో మమేకమై ఉందన్నారు. గత సవాళ్లను ఎదుర్కొని వాటిని అవకాశాలుగా మలుచుకుని భవిష్యత్తును నిర్మించుకుంటున్నామని తెలిపారు.

ఐదు మార్పులు..

  • భారత్​లో జరుగుతున్న ఐదు కీలక మార్పులను వివరించారు మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా సమాచార వ్యవస్థను నిర్మిస్తున్నామని, 60వేల గ్రామాలను అనుసంధానించేందుకు సంకల్పించుకున్నట్లు చెప్పారు. కొవిన్​, ఆరోగ్య సేతు ద్వారా 1.1 బిలియన్​ డోసులు పంపిణీ చేసినట్లు చెప్పారు.
  • సాధికారత, కనెక్టివిటీ ప్రయోజనాలు, సంక్షేమం, పాలనలో డిజిటల్​ సాంకేతికతను ఉపయోగించటం ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు మోదీ.
  • ప్రపంచంలోనే మూడో అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను భారత్​ కలిగి ఉందన్నారు మోదీ. ఆరోగ్యం నుంచి దేశ భద్రత వరకు అన్నింటికీ పరిష్కారం చూపేందుకు పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు.
  • వనరుల మార్పిడి, జీవవైవిధ్య పరిరక్షణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారత పరిశ్రమ, సేవల రంగాలు డిజిటల్​గా మార్పు చెందుతున్నాయని తెలిపారు మోదీ.
  • భవిష్యత్తు కోసం భరత్​ను సిద్ధం చేసేందుకు పెద్ద ప్రయత్నం జరుగుతోందన్నారు. 5జీ, 6జీ వంటి టెలికాం టెక్నాలజీలో స్వదేశీ సామర్థ్యాన్ని పెంచేందుకు పెట్టుబడులు పెడుతున్నాం. కృత్రిమ మేధలో అగ్రగామి దేశాల్లో భారత్​ ఒకటి.

ఆస్ట్రేలియా స్ట్రాటజిక్​ పాలసీ ఇన్​స్టిట్యూట్​ చేపట్టిన సిడ్నీ డైలాగ్​ను ఈనెల 17 నుంచి 19వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​, జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేలు.. సాంకేతికత ద్వారా కలిగే అవకాశాలు, ఎదురయ్యే సవాళ్లపై మాట్లాడనున్నారు.

Last Updated :Nov 18, 2021, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.