Woman Murder Case: వివాహిత హత్య కేసులో బయటపడిన నిజం.. ఆమెను మట్టుపెట్టింది అతనే

author img

By

Published : May 22, 2023, 10:54 AM IST

Woman murder case

Murder Case : వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకు చెందిన కోట రాధ హత్యకేసు ఒక కొలిక్కి వచ్చింది. తానే తన భార్యను హత్య చేశానని మృతురాలి భర్త మోహన్‌ రెడ్డి పోలీసు విచారణలో అంగీకరించినట్టు సమాచారం. కేవలం తానొక్కడే ఈ హత్యకు పాల్పడ్డాడా.. ఇంకా ఎవరైనా సహకరించారా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాధను హత్య చేయడం ఆపై మృతదేహాన్ని రోడ్డుపై పడేయటం.. మృతురాలి శరీరంపై ఉన్న తీవ్ర గాయాలు హత్యకు ఎవరైనా సహకరించారా? అనే అనుమానాలకు తావిస్తున్నాయి.

Woman Murder Case Update: ఆమె స్నేహితుడైన కాశి రెడ్డికి భారీ మొత్తంలో రుణం ఇప్పించిన మృుతురాలు.. తిరిగి రుణాన్ని అతని వద్ద నుంచి రాబట్టుకోలేకపోయింది. భారీ మొత్తంలో నగదు రుణం ఇప్పించిన వ్వవహారం.. ఆమె కుటుంబంలో కలహాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఎలగైనా తన భార్యను మట్టుబెట్టాలని మోహన్​రెడ్డి నిర్ణయించుకున్నాడు. సరైన సమయం కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో 15 రోజులుగా సెల్‌ఫోన్​ మేసేజ్​లతో నాటకానికి తెరలేపాడు. ఈ తరుణంలో ఆమె పుట్టిన ఊరికి సమీపాన నిర్వహించే చౌడేశ్వరీ దేవి కొలుపులకు హాజరయ్యేందుకు గాను రాధ ఇటీవలే పుట్టింటికి చేరింది. దీనిని ఆమె భర్త సానుకూలంగా చేసుకుని అవకాశంగా వాడుకున్నాడు. కాశిరెడ్డి పేరిట సిమ్‌ కార్డులు కొనుగోలు చేశాడు. అతని పేరుతోనే రాధకు సెల్​ఫోన్​కు సందేశాలు పంపుతూ ఛాటింగ్‌ చేశాడు. భర్తే కాశిరెడ్డి పేరుతో సందేశాలు పంపుతున్న విషయాన్ని రాధ పసిగట్టలేకపోయింది.

తన భార్య రాధతో మోహన్‌ రెడ్డి గత వారం రోజులుగా పలు సిమ్‌కార్డుల నుంచి ఛాటింగ్‌ చేసినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. హత్య జరగటానికి కొద్ది గంటల ముందు కూడా సూర్యాపేటలో.. కాశిరెడ్డి పేరుతోనే సందేశాలు పంపాడు. ఓ చెరకు రసం బండి నిర్వాహకుడికికి తన సెల్‌ఫోన్‌ పనిచేయటం లేదని చెప్పి నమ్మబలికి.. అతని సెల్​ఫోన్‌ నుంచి కాశిరెడ్డి పేరుతో తీసుకున్న సిమ్‌ వేసి సందేశాలు పంపాడు. పల్నాడులోని వినుకొండకు చేరుకున్న తర్వాత.. మరొకరి నుంచి సెల్‌ తీసుకుని, తన సిమ్‌ వేసి సాయంత్రం కనిగిరి వస్తానని ఆమెకు మెసేజ్​ చేశాడు. కనిగిరి చేరుకున్న తర్వాత పామూరు బస్టాండ్‌లో అక్కడ ఓ యువతితో మాటలు కలిపి.. ఆమె ఫోన్‌ నుంచి కూడా తాను కనిగిరి వచ్చానని మరో సందేశం పంపాడు. కాశిరెడ్డి వచ్చాడని, డబ్బు ఇస్తాడని అనకున్న రాధ కనిగిరికి చేరుకుంది.

హత్య ఎవరు చేశారన్నది నిర్ధారించుకున్న పోలీసులు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వేచి ఉన్నారు. ఆ తర్వాత కోదాడలో మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మోహన్​రెడ్డి నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. తానొక్కడినే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని అతను వెల్లడించినట్టు సమాచారం. ఇక్కడే పలు అనుమానాలకు తావిస్తోంది. రాధ శరీరంపై ఉన్న గాయాలు చూస్తే.. మోహన్‌రెడ్డితో పాటు మరికొందరు ఈ హత్యలో పాల్గొని ఉంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ వ్యక్తులు ఎవరన్నది తేలాల్సి ఉంది.

అసలు కథ మలుపు తిరిగింది ఇక్కడే : కాశిరెడ్డి తమ కుమార్తెను హత్య చేశాడని రాధ తల్లిదండ్రులు తొలుత ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. పోలీసు విచారణ సాగుతున్న సమయంలో రాధ భర్త మోహన్‌ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు. తనకు హత్య ఉదంతం ఏమీ తెలియదనే తీరుగా వ్యవహరించ సాగాడు. కాశిరెడ్డే హత్య చేశాడని పోలీసులను కూడా నమ్మించాడు. అతని కదలికలపై కూడా కన్నేశారు ఈ విషయాన్ని భర్త మోహన్​రెడ్డి పసిగట్టలేకపోయాడు. హత్య జరిగిన రోజు మోహన్​రెడ్డి కనిగిరిలోనే ఉన్నట్టు పోలీసులు గూగుల్‌ టేకౌట్‌ ద్వారా గుర్తించారు. ఆ రోజు హైదరాబాద్‌లో ఉన్నట్టు మోహన్​ రెడ్డి అందరితోనూ నమ్మబలకడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఎంత నాటకమాడినా హంతకుడు ఎవరన్నది పోలీసులకు స్పష్టత వచ్చినట్లైంది.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.