'సోషల్​ మీడియా అకౌంట్ల డీపీ మార్చుకోండి'.. ప్రజలకు మోదీ పిలుపు

author img

By

Published : Jul 31, 2022, 12:18 PM IST

Updated : Jul 31, 2022, 12:53 PM IST

PM Narendra Modi Mann Ki Baat

PM Modi Mann Ki Baat: ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు దేశ ప్రజలందరూ తమ సోషల్​ మీడియా ఖాతాల ప్రొఫైల్​ పిక్చర్​గా జాతీయ జెండా ఫొటో పెట్టుకోవాలని ప్రధాని మోదీ కోరారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమం ఓ సామూహిక ఉద్యమంగా మారడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఉన్నారు.

PM Modi Azadi ka Amrith Mahotsav: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమం ఒక సామూహిక ఉద్యమంగా మారుతోందని, అందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆగస్టు 2 నుంచి 15 వరకు.. ప్రజలందరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్​గా జాతీయ జెండా ఫొటోను పెట్టుకోవాలని మోదీ కోరారు. ఈ మేరకు మన్​కీ బాత్​ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షహీద్ ఉధమ్ సింగ్​కు ఆయన నివాళులర్పించారు.

"ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు 'హర్​ ఘర్​ తిరంగా' పేరుతో ప్రత్యేక ఉద్యమం నిర్వహిస్తున్నాం. ఆ మూడు రోజులు.. ప్రతి ఇంటి వద్ద జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోండి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో మనమందరం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక ఘట్టాన్ని చూడబోతున్నాం. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో ఏదో రూపంలో పాల్గొంటున్నారు."

-- నరేంద్ర మోదీ, ప్రధాని

ఆటబొమ్మల ఎగుమతిలో భారత్​ పవర్‌హౌస్‌గా.. ఆటబొమ్మల ఎగుమతిలో ఇండియా పవర్‌హౌస్‌గా మారుతోందని మోదీ అన్నారు. బొమ్మల ఎగుమతి రూ.300-400 కోట్ల నుంచి రూ.2,600 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. "భారతీయ పురాణాలు, చరిత్ర, సంస్కృతి ఆధారంగా తయారీదారులు ఇప్పుడు ఆట బొమ్మలను తయారు చేస్తున్నారు. వాటి నుంచి మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. అవే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్నాయి." అని మోదీ తెలిపారు. మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి ఆగస్టు 2నే అని ప్రధాని గుర్తుచేశారు. త్రివర్ణ పతాక రూపకల్పనలో మేడం కామా కూడా కీలక పాత్ర పోషించినట్లు ఆయన స్మరించుకున్నారు.

75 రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కర్ణాటకలో 'అమృత భారతి కన్నడర్తి' పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మోదీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రదేశాల్లో.. ఆయా ప్రాంతాలకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుల్ని స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించినట్లు వెల్లడించారు. స్వాతంత్ర్య పోరాటంలో రైల్వేల ప్రాముఖ్యతను వివరిస్తూ 'ఆజాదీ కా రైల్‌గాడీ' పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 75 రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి: సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ దాడులు.. 'చనిపోయినా సరే.. ఎవరికీ లొంగను'

ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ సంబరాలు.. ఎందుకంటే?

Last Updated :Jul 31, 2022, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.