సీయూఈటీ-యూజీ ఫలితాలు వచ్చేశాయి.. మీ ర్యాంకు​ చూసుకున్నారా?

author img

By

Published : Sep 16, 2022, 6:31 AM IST

CUET UG 2022 Results

CUET UG 2022 Results: ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 259 నగరాలు/పట్టణాల్లో 489 పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని ఆరు నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.

CUET UG 2022 Results: ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 259 నగరాలు/పట్టణాల్లో 489 పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని ఆరు నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తంగా ఆరు దశలుగా జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 14.9లక్షల మందికి పైగా నమోదు చేసుకున్నారు. తొలుత గురువారం రాత్రి 10 గంటలకు పరీక్ష ఫలితాలు వెలువడతాయని ప్రకటించారు. అయితే కొన్ని కారణాలతో ఆలస్యం అవుతోందని సమయం పడుతుందని ఎన్‌టీఏ ట్వీట్‌ చేసింది.

44 సెంట్రల్‌ యూనివర్సిటీలు, 12 స్టేట్‌ యూనివర్సిటీలు 11 డీమ్డ్‌ యూనివర్సిటీలు, 19 ప్రయివేటు వర్సిటీలతో కలిపి దేశవ్యాప్తంగా 99 విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం తొలిసారి ఈ పరీక్షను నిర్వహించారు. తుది ఆన్సర్ కీ ఆధారంగా ఈ ఫలితాలు విడుదల చేసినట్టు ఎన్‌టీఏ వెల్లడించింది. ఫలితాలను www.nta.ac.in, https://cuet.samarth.ac.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. మరోవైపు, యూనివర్సిటీలు కొత్త విద్యా సంవత్సరాన్ని అక్టోబర్‌ ఆఖర్లో లేదా నవంబర్‌ తొలి వారం నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్టు యూజీసీ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌ కుమార్‌ తెలిపారు.

ఇవీ చదవండి: 'దాచిపెట్టాల్సిందేమీ లేదు.. పారదర్శకంగానే అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తాం'

200 అడుగుల బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.