పొట్టలో 63 స్పూన్లు.. ఆపరేషన్​ చేసి తొలగింపు.. ఎలా వెళ్లాయంటే?

author img

By

Published : Sep 28, 2022, 11:08 AM IST

3 steel spoons found in man's stomach in muzaffarnagar

అనారోగ్యంతో ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు అతనికి పరీక్షలు చేసి ఆపరేషన్​ చేశారు. కానీ అతని పొట్టలో ఉన్న వస్తువులను చూసి షాక్​కు గురయ్యారు. అతడి కడుపులో నుంచి ఏకంగా 63 స్పూన్లను వెలికితీశారు.

ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి కడుపులో నుంచి ఏకంగా 63 స్పూన్లను వెలికితీశారు వైద్యులు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే అతడి కడుపులోకి అన్ని స్పూన్లు ఎలా వెళ్లాయన్న విషయంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. మన్సూరాపూర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని బోపాడా గ్రామానికి చెందిన విజయ్​ అనే వ్యక్తి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. అతడికి ఆ అలవాటును మాన్పించేందుకు కుటుంబసభ్యులు విజయ్​ని షామ్​లీలోని డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్​లో చేర్పించారు. అక్కడ ఓ నెలరోజుల పాటు చికిత్స పొందాడు. డీఅడిక్షన్​ సెంటర్​లో ఉన్న విజయ్​కి అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది.

కుటుంబసభ్యులు వెంటనే ముజఫర్​నగర్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. విజయ్ప​కు పరీక్షలు నిర్వహించి ఆపరేషన్​ చేసిన వైద్యులు షాక్​కు గురయ్యారు. అతడి కడుపులో ఏకంగా 63 స్పూన్లు కనిపించాయి. ఆపరేషన్​ చేసిన వైద్యులు వాటిని వెలికితీశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ స్పూన్లు అతని కడుపులోకి ఎలా వచ్చాయని వైద్యులు ఆరా తీస్తున్నారు. డ్రగ్​ డీఅడిక్షన్ సెంటర్​ సిబ్బందే విజయ్​కి బలవంతంగా స్పూన్లు తినిపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై విజయ్​ ఎంటువంటి ఫిర్యాదు చేయలేదు.

ఇదీ చదవండి: పీఎఫ్​ఐను నిషేధించిన కేంద్రం.. ఉపా చట్టం కింద ఐదేళ్లు బ్యాన్​

మత్స్యకారుల పడవ మునక.. సముద్రంలో దూకిన 19మంది.. ఆ తర్వాత..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.