మహాశివుడికి ముస్లిం సోదరుల నిత్య పూజలు!

author img

By

Published : Mar 12, 2021, 4:27 PM IST

Muslim man lit diyas at a temple in Shopian area of Jammu and Kashmir on Thursday

శివుని సాక్షిగా మతాల మధ్య అడ్డుగోడలను తొలగిస్తున్నారు ఇద్దరు ముస్లింలు. మహాశివరాత్రిని పురస్కరించుకొని జమ్ముకశ్మీర్​లో శివాలయంలో దీపాలు వెలిగించాడు ఓ ముస్లిం భక్తుడు. ఇక మతసామరస్యానికి ప్రతీకగా ఉత్తర్​ప్రదేశ్​లో ఏకంగా ఓ ఈశ్వరాలయాన్నే నిర్మించాడు మరో ముస్లిం సోదరుడు.

దేశవ్యాప్తంగా హిందువులు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్న వేళ జమ్ముకశ్మీర్​లోని ఓ శివాలయంలో జ్యోతి వెలిగించాడు ఓ ముస్లిం వ్యక్తి. షోపియన్​లోని తీరథ్ రాజ్ కపల్ మోచన్ దేవగమ్​లో గురువారం భారీ వర్షాన్ని సైతం లెక్కచేయక.. ఆలయంలో దీపాలు వెలిగించాడు గులాం ఖాదిర్ షేక్. ఆ గుడి సంరక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు.

శివరాత్రి రోజు శివాలయంలో జ్యోతి వెలిగించిన ముస్లిం

పర్యాటక శాఖ కొన్నేళ్ల క్రితం తనను రెండు నెలలపాటు ఆలయ పరిరక్షణ చూసుకోవాలని, అందుకు కొంత మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించిందని ఖాదిర్ చెప్పారు. అయితే తాను ఆ తర్వాత కూడా గుడికి రావడం మానలేదని వివరించారు.

Muslim man lit diyas at a temple in Shopian area of Jammu and Kashmir on Thursday
గులాం ఖాదిర్ షేక్

"నాకు ఎవరూ డబ్బులు ఇవ్వకపోయినా.. ఇప్పటికీ ఆలయాన్ని చూసుకుంటున్నా. ఒక కశ్మీరీగా నా పండిట్​ సోదరుల పట్ల అది నా బాధ్యత అని భావిస్తాను.హెరాత్ (శివరాత్రి)​ సందర్భంగా ఈ రోజు కశ్మీరీ పండిట్ భక్తులెవరూ గుడికి రావడం నేను చూడలేదు. అందుకే వచ్చి దీపాలు వెలిగించాను. "

-గులాం ఖాదిర్ షేక్, ఆలయ సంరక్షుడు

శివరాత్రిని 'హెరాత్​'గా జరుపుతారు కశ్మీరీ పండిట్లు. మూడు రోజులపాటు నిర్వహిస్తారు.

Muslim man lit diyas at a temple in Shopian area of Jammu and Kashmir on Thursday
బాబు ఖాన్

ఇతర మతాలను గౌరవించాలి..

సర్వ మతాలు సమానమే అని చాటుతున్నారు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన బాబూఖాన్. ఇతర మతాల్లో ఆలయాలను నిర్మించిన తన పూర్వీకుల వారసత్వాన్ని ఆయన పుణికిపుచ్చుకున్నారు.

Muslim man lit diyas at a temple in Shopian area of Jammu and Kashmir on Thursday
శివునికి పూజ చేస్తున్న బాబు ఖాన్

దాదాపు రూ.లక్ష ఖర్చు చేసి 2013లో అలీగఢ్​లో శివాలయాన్ని నిర్మించారు బాబు. అప్పటినుంచి అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ఎవరి మతాలను వారు పాటిస్తూనే ఇతర మతాలనూ గౌరవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: అబ్బురపరిచే సూక్ష్మ కళ.. సీసాలో హరుని కోవెల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.