అధిక సంతానం ఉన్నవారికి ప్రైజ్​మనీ - రూ.2.5 లక్షలు పంపిణీ!

author img

By

Published : Oct 14, 2021, 8:24 AM IST

mizoarm baby boom offers

తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్నవారికి మిజోరం(Mizoram Population) క్రీడా శాఖ మంత్రి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. 17 మంది తల్లిదండ్రులకు దాదాపు రూ.2.5 లక్షల నగదుతో పాటు , ప్రశంసాపత్రాలను పంపిణీ చేశారు.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు జనాభా నియంత్రణపై దృష్టి పెడుతుంటే.. మిజోరంలో(Mizoram Population) మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. స్వయంగా ఆ రాష్ట్ర(Mizoram Population) క్రీడా శాఖ మంత్రి రాబర్ట్​ రోమానియా.. అధిక సంతానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా.. తన నియోజకవర్గం ఐజ్వాల్​ తూర్పు-2 పరిధిలో అధిక సంతానం ఉన్న 17 మంది తల్లిదండ్రులకు దాదాపు రూ.2.5 లక్షల నగదు ప్రోత్సాహకాలు, ప్రశంసాపత్రాలను అందజేశారు.

ఆనాడు చెప్పినట్లుగా..

తన నియోజకవర్గం పరిధిలో అత్యధిక సంతానం ఉన్న తల్లి లేదా తండ్రికి రూ.లక్ష నగదు ప్రోత్సాహకం అందిస్తానని ఫాదర్స్‌ డే సందర్భంగా జూన్​లో రొమావియా వెల్లడించారు. నగదు బహుమతితో పాటు ట్రోఫీ కూడా అందజేస్తానని తెలిపారు. మిజో తెగల్లో జనాభాను(Mizoram Population) పెంచేందుకు తాను ఈ ఆఫర్‌ ప్రకటించినట్లు వెల్లడించారు. ఆ ప్రకటన మేరకు తాజాగా వారికి ప్రోత్సహకాలు అందించారు.

  • 7 మంది కుమారులు సహా 15 మంది సంతానం కలిగిన తుయిథియాంగ్ ప్రాంతానికి చెందిన వితంతువు గౌరువీ.. ఇందులో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఆమెకు రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రాన్ని రోమానియా అందజేశారు.
  • వేంగ్ ప్రాంతానికి చెందిన లియాథాంగీ అనే వితంతువుకు 13 పిల్లలు ఉన్నందున ఆమెకు రూ.30,000 నగదుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందించారు.
  • 12 మంది సంతానం ఉన్న ఇద్దరు మహిళలు, ఓ పురుషుడికి.. రూ.20,000 చొప్పున నగదు, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
  • వీరితో పాటు 8 మంది సంతానం ఉన్న 12 మంది తల్లిదండ్రులకు రూ.5,000 చొప్పున నగదు బహుమతి అందించారు.

మిజో తెగల్లో(Mizoram Population) సంతానలేమి రేటు, జనాభా వృద్ధి రేటు తగ్గుతుండటం ఆందోళనకరమైన అంశంగా మారిందని రోమానియా తెలిపారు. "ఇద్దరు పిల్లల నిబంధనను పాటించడం మిజో వంటి తక్కువ జనసాంద్రత ఉన్న రాష్ట్రాల్లో పాటించడం ఎంత మాత్రం తగదు. మిగతా రాష్ట్రాల్లో ఒక చదరపు కిలోమీటరకు 600 మంది ఉంటే.. మిజోరంలో కేవలం 50 మందే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సమీక్షించి, అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రాల్లోనే ఇద్దరు పిల్లల నిబంధన వర్తించేలా చర్యలు తీసుకోవాలని" అని ఆయన చెప్పారు.

మరోవైపు.. అసోం, ఉత్తర్​ప్రదేశ్​ వంటి రాష్ట్రాలు జనాభా కట్టడి కోసం ఇద్దరు పిల్లల నిబంధను అమలు చేస్తున్నాయి.

ఇదీ చూడండి: కేంద్రం కొత్త రూల్స్​- 24 వారాల తర్వాత కూడా అబార్షన్​కు ఓకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.