ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దారుణ ఘటనలు జరిగాయి బాలికలపై దుండగులు అత్యాచారాలకు తెగబడ్డారు ఓ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు మరో బాలికపై ఆరుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారుMinor Girl Incident జాతర చూడడానికి వెళ్లిన బాలికను కొంత మంది దుండగులు వేధింపులకు గురిచేశారు దీనిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లగా దళితులమని తమను బయటకు తరిమేశారని బాధితురాలి తండ్రి ఆరోపించారు ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లా అచల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రం బాధితురాలు తన సోదరుడితో కలిసి జాతర చూడడానికి వెళ్లింది అనంతరం వారిద్దరూ అక్కడ ఉన్న ఊయలలో ఆడుకున్నారు అప్పుడే దాదాపు డజను మంది అక్కడికి చేరుకుని బాలికను వేధించడం మొదలు పెట్టారు తర్వాత ఆమె చున్నీ లాగారు అనంతరం బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాలిక సోదరుడిని బాలికను దారుణంగా కొట్టారు తర్వాత ఇద్దరూ అక్కడ నుంచి పారిపోయి జరిగిన విషయం కుటుంబ సభ్యులకు వివరించారు విషయం తెలుసుకున్న కుంటుంబ సభ్యులు ఆవేశంతో ఊగిపోయారు అనంతరం ఫిర్యాదు చేయాడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు తర్వాత పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా ఆ కుటుంబాన్ని బయటకు గెంటేశారు తన కుమార్తె కుమారుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు వాళ్లు ఓ ఉన్నత వర్గానికి చెందినవారు కనుక వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు వాళ్లకు కుర్చీలు వేసి పోలీసులు మర్యాదలు చేస్తున్నారని తాము దళితులము కాబట్టి తమ మాటలు పోలీసులు వినిపించుకోవడం లేదన్నారు అనంతరం బాధిత కుటుంబాలు పోలీస్ స్టేషన్ బయట బైఠాయించి నిరసన తెలియజేశారు దీనిపై స్పందించిన అచల్‌గంజ్ పోలీసులు ఇరు వైపుల నుంచి ఫిర్యాదు అందిందని చెప్పారు రెండు వైపుల నుంచి కేసులు నమోదు చేశామని అన్నారు దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు 16ఏళ్ల బాలికపై రేప్మహారాష్ట్రలో దారుణం జరిగింది ముగ్గురు దుండగులు 16 ఏళ్ల బాలికను రేప్ చేశారు వారిపై ఐపీసీ సెక్షన్ 376డీ పోక్సో చట్టం కింది కేసు నమోదు చేసినట్టు ఠాణె పోలీసులు పేర్కొన్నారు ఈ కేసును నార్పోలి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్టు తెలిపారు బాలికను ఆపహరించి రేప్ పరిస్థితి విషమంబాలికను ఆరుగురు దుండగులు కలిసి అపహరించారు అనంతరం గ్యాంగ్ రేప్‌కు తెగబడ్డారు ఆసుపత్రికి తరలించిన బాలిక పరిస్థితి విషమంగా ఉంది ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఆదివారం జరిగింది పోలీసుల వివరాల ప్రకారం ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికను ఆరుగురు నిందితులు కిడ్నాప్ చేశారు అనంతరం దగ్గరలోని పొలాల్లోకి తీసుకెళ్లి రేప్‌కు తెగబడ్డారు తర్వాత బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు దాదాపు 25 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు నిందితులపై ఐపీసీ సెక్షన్లు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు బాలిక ఆరోగ్య విషమంగా ఉందని చెప్పారు పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని ఎస్పీ కమ్లేశ్ దీక్షిత్ తెలిపారు చాక్లెట్ ఆశ చూపి ఐదేళ్ల బాలిక రేప్మరోవైపు ఐదేళ్ల బాలికను చాక్లెట్‌తో ప్రలోభపెట్టి రేప్ చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం జరిగింది బాలిక అరుపులతో అక్కడికి వచ్చిన స్థానికులు బాలుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు పోలీసుల వివరాల ప్రకారంఉత్తర్ప్రదేశ్లోని బరేలీలో 15 ఏళ్ల బాలుడు ఐదేళ్ల బాలికను రేప్ చేశాడు చాక్లెట్‌తో ప్రలోభపెట్టి నిర్మానుష్య ప్రదేశానికి బాలికను తీసుకెళ్లాడు అనంతరం రేప్‌కి ఒడిగట్టాడు బాలిక అరుపులతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అనంతరం బాలుడిని పోలీసులకు అప్పగించారు పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని అతడి తండ్రిని అరెస్టు చేశారు పలు ఐపీసీ సెక్షన్ల ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేశామని ఏఎస్పీ రాహుల్ భాటి తెలిపారు మానసిక స్థితి బాగోలేని బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటికి వెళ్లగా అతడి తండ్రి వారితో గొడవపడ్డాడు దీనిపై ప్రతికారం తీర్చుకుంటానని బెదిరించాడని అతడు అన్నట్టు ఇన్స్పెక్టర్ రాజీవ్ కుమార్ తెలిపారు ఇవీ చదవండి పేకమేడల్లా కూలిన ట్విన్ టవర్స్ ఆఖరి నిమిషంలో గాలి ట్విస్ట్ ఇచ్చినాచేతిలో చిన్నారి మృతదేహం గుండెల నిండా దుఃఖం అంబులెన్స్ లేక కాలినడకన