ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి.. 700 అడుగుల లోతు లోయల పడ్డ వాహనం
Updated on: Nov 18, 2022, 8:49 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి.. 700 అడుగుల లోతు లోయల పడ్డ వాహనం
Updated on: Nov 18, 2022, 8:49 PM IST
19:47 November 18
ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి.. 700 అడుగుల లోతు లోయల పడ్డ వాహనం
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చమోలీ జిల్లాలోని ఉగ్రం-పల్ల జఖోలా రహదారిలో ఓ టాటా సుమో ప్రమాదానికి గురైంది. 16 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి 700 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా 12 మంది చనిపోయారు. సమాచారం అందుకున్న చమోలీ డీఎమ్ హిమాన్షు ఖురానా, ఎస్ఎస్పీ ప్రమేంద్ర దోబాల్, ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ బృందం ఇప్పటి వరకు ఇద్దరు మహిళలతో సహా 12 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు.
ఘటనా స్థలంలో చీకటిగా ఉండటం, లోయ లోతు ఎక్కువగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. చమోలీ జిల్లా మెజిస్ట్రేట్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ఉచితంగా వైద్య అందించేలా అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి : నెదర్లాండ్స్‌లో మనోళ్ల ఇడ్లీ పిండి బిజినెస్.. సూపర్ హిట్ లాభాలు!
