హత్య కేసులో వ్యక్తి అరెస్ట్​- సీరియల్ కిల్లర్​ అని తెలిసి పోలీసులు షాక్​

author img

By

Published : Jan 11, 2022, 10:05 AM IST

serial-killer

Serial killer: యువతి హత్య కేసులో నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులకు విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. తాను సీరియల్​ కిల్లర్​నని, అంతకుముందే ముగ్గురు మైనర్లను చంపినట్లు అతడు వెల్లడించాడు.

Serial killer: హరియాణా ఫరిదాబాద్​లో 22 ఏళ్ల యువతి హత్య కేసులో 54 ఏళ్ల నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం విచారణలో అతడు చెప్పిన నిజాలు తెలిసి కంగుతిన్నారు. తాను గతంలోనూ మూడు హత్యలు చేశానని నిందితుడు పోలీసులకు వెల్లడించాడు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించినందుకు ఆ ముగ్గురినీ చంపినట్లు చెప్పాడు. వారంతా మైనర్లే కావడం గమనార్హం.

serial-killer
యువతి హత్య కేసులో వ్యక్తి అరెస్ట్​

'2019లో డిసెంబర్​లో 15 ఏళ్ల బాలికను అత్యాచారం చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడం వల్ల కోపంతో దారుణంగా హత్య చేశాడు. అలాగే 2020 ఆగస్టు, 2021 జూన్​లోనూ ఇద్దరు మైనర్లను హతమార్చాడు. విచారణ ఇంకా కొనసాగుతోంది' అని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: దేశ రాజకీయాల్లో 'టెక్​ ఫాగ్'​ కలకలం- భాజపాపై విపక్షాల నిప్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.