కాంగ్రెస్లో చేరిన సోనూసూద్ సోదరి మాళవిక
Updated on: Jan 10, 2022, 6:29 PM IST

కాంగ్రెస్లో చేరిన సోనూసూద్ సోదరి మాళవిక
Updated on: Jan 10, 2022, 6:29 PM IST
Sonusood sister Congress: సోనూసూద్ సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశముంది.
Sonusood sister politics: ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త అయిన సోనూసూద్ సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్లో చేరారు. సోమవారం మోగాలోని సోనూ నివాసంలో పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చన్నీ కలిసి పార్టీలోకి ఆమెను సాదరంగా ఆహ్వానించారు.
ఫిబ్రవరి 14న జరగనున్న ఎన్నికలకు ముందు మాళవికా సూద్ పార్టీలో చేరడంపై సిద్ధూ హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని 'గేమ్ ఛేంజర్' గా అభివర్ణించారు. పీసీసీ చీఫ్, సీఎం ఇద్దరూ కలసి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం చాలా అరుదు అని తెలిపిన సిద్ధూ.. ఈ గౌరవం పొందడానికి మాళవిక అర్హురాలని కితాబిచ్చారు. స్వచ్ఛంద సంస్థ నడుపుతూ.. ప్రజాసేవకు అంకితమై మంచి పేరు తెచ్చుకున్న మాళవిక తమ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని సిద్ధూ అన్నారు.
మాళవిక సొంత నియోజకవర్గం అయిన మోగా నుంచి పోటీ చేస్తారా లేదా అనే దానిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సీఎం చన్నీ చెప్పారు.
ఇదీ చూడండి: ఆ వీడియో లీక్ చేస్తానని మంత్రికి బెదిరింపులు.. చివరకు...
