వలస కూలీకి రూ.75 లక్షల జాక్​పాట్.. భయంతో పోలీస్​ స్టేషన్​కు.. చివరకు..

author img

By

Published : Mar 17, 2023, 10:14 PM IST

kerala worker won lottery

కేరళలో ఓ కూలీకి ఏకంగా రూ.75 లక్షల లాటరీ తగలింది. అయితే లాటరీ టిక్కెట్​ను ఎవరైనా దొంగలిస్తారేమోనన్న భయంతో అతడు ఓ పోలీస్​ స్టేషన్​కు పరుగు తీశాడు. చివరకు పోలీసులు అతడికి ధైర్యం చెప్పి ఇంటికి పంపించారు.

సాధారణంగా ఎవరికైనా లాటరీ తగిలితే ఏం చేస్తారు..? ఎగిరి గంతేస్తారు.. ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. కానీ, బంగాల్​కు చెందిన ఓ కార్మికుడు మాత్రం రూ.75 లక్షల లాటరీ వచ్చిందన్న భయంతో పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించాడు.

ఇదీ జరిగింది
ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఎస్‌కే బాదేశ్​ ఓ దినసరి కూలీ. కొద్ది నెలల క్రితం పొట్ట కూటి కోసం కేరళ ఎర్నాకులం జిల్లాలోని చొట్టానికర ప్రాంతానికి వచ్చి రోడ్డు నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బాదేశ్​​కు తరచూ లాటరీ టిక్కెట్లు కొనే అలవాటు ఉంది. కానీ, ఒక్కసారి కూడా గెలవలేదు. కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి స్త్రీ-శక్తి అనే లాటరీ టిక్కెట్​ను ఇటీవలే కొనుగోలు చేశాడు. మంగళవారం రాత్రి లాటరీ డ్రాను తీశారు నిర్వాహకులు. ఈ డ్రాలో మొదటగా ఎస్ఆర్ 570994 అనే సంఖ్యతో ఉన్న టిక్కెట్ బాదేశ్​​ పేరుతో రావడం వల్ల రూ.75,00,000 ప్రైజ్​ మనీని గెలుపొందాడు బాదేశ్​.

లాటరీ గెలవడం వల్ల ఆనంద పడ్డ బాదేశ్..​​ ఆ తర్వాత భయపడ్డాడు. తనకు వచ్చిన లాటరీ టిక్కెట్​ను ఎవరైనా తనను బెదిరించి ఎత్తుకెళ్తారేమోనని అనుమానించాడు. ఈ కారణంతోనే బాదేశ్​​ స్థానికంగా ఉండే మువట్టుపుఝా పోలీస్​ స్టేషన్​కు పరుగులు తీశాడు. అనంతరం అక్కడున్న పోలీసులను తనకు లాటరీ డబ్బుకు రక్షణ కల్పించమని కోరాడు. అయితే బాదేశ్​​ స్టేషన్​కు రావడానికి గల కారణాన్ని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు.

అయితే బాదేశ్​కు వచ్చిన లాటరీ టిక్కెట్​ను ఎలా క్లెయిమ్​ చేసుకోవాలనే తెలీయదని.. దానిని ఎవరైనా అపహరిస్తారనే భయంతోనే తమ వద్దకు వచ్చినట్లు కేరళ పోలీసులు తెలిపారు. బాదేశ్​ బాధను అర్థం చేసుకున్న పోలీసులు లాటరీకి సంబంధించి పూర్తి విధివిధానాలను క్లుప్తంగా అతడికి వివరించారు. దాన్ని బ్యాంక్​లో ఎలా డిపాజిట్​ చేసుకోవాలో అని పోలీసులు బాదేశ్​కు చెప్పారు. అంతేగాక అతడికి రక్షణ కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. చివరకు పోలీసులిచ్చిన ధైర్యంతో బాదేశ్​​ క్షేమంగా లాటరీతో ఇంటికి చేరుకున్నాడు. కాగా, బాదేశ్​​ ఇంత భారీ మొత్తంలో ప్రైజ్​ మనీ గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఇక ఈ డబ్బు చేతికొచ్చాక తన స్వగ్రామానికి వెళ్లి తన సొంతింటికి మరమ్మతులు చేయిస్తానని.. అలాగే తన వ్యవసాయాన్ని కూడా విస్తరించుకుంటానని బాదేశ్​ తెలిపాడు.

kerala worker won lottery
రూ.75 లక్షల లాటరీ గెలిచిన బడెస్​

వృద్ధుడికి రూ.5 కోట్ల జాక్​పాట్​..
పంజాబ్​కు చెందిన మహంత్​ ద్వారకా దాస్​ అనే వృద్ధుడిని అక్షరాల రూ.5 కోట్ల లాటరీ వరించింది. దీంతో అతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.