భారత్​లో పుట్టిన మరో 'మెస్సీ'!.. అభిమానాన్ని చాటుకున్న కేరళ జంట

author img

By

Published : Nov 25, 2022, 9:14 AM IST

Updated : Nov 25, 2022, 9:36 AM IST

Kerala couple names newborn 'Messi' during Argentina-Saudi Arabia match

ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్​ రసవత్తరంగా సాగుతున్న సమయంలో తమ అభిమానాన్ని చాటుకుంది ఓ జంట. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ​ పేరును తమ తనయుడికి పెట్టి ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.

అభిమాన తారలు లేదా క్రీడాకారుల పేర్లను తమకు పుట్టిన పిల్లలకు పెట్టుకుని మురిసిపోతుంటారు కొందరు వ్యక్తులు. ఇలాంటి వల్లమాలిన అభిమానానికి మరో ఉదాహరణగా కేరళకు చెందిన ఓ జంట నిలుస్తోంది. ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్ జరుగుతోన్న​ సమయంలో తమ చిన్నారికి మెస్సీ అని నామకరణం చేసి తమ అభిమానాన్ని చాటుకుంది ఆ జంట.

కేరళ తిస్సూర్​లోని చాలకుడికిలోని ఓ ఇండోర్​ స్టేడియంలో ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్​ను ప్రదర్శిస్తున్నారు. అర్జెంటీనాకు సౌదీకి మధ్య జరుగుతున్న హోరా హోరీ మ్యాచ్​కు తిలకించేందుకు ఆ స్టేడియానికి వందల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సరిగ్గా అదే సమయంలో షానీర్​, ఫాతిమా జంట అక్కడి వచ్చి మ్యాచ్​ తిలకించారు. ఆ తర్వాత తమ తనయుడికి మెస్సీ అని నామకరణం చేశారు. పెద్దల సమక్షంలో కేక్​ కట్ చేసి అందరికి పంచారు.

Kerala couple names their newborn Messi
కేక్​ కట్​ చేసి సంబరాలు చేస్తున్న జంట

రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంటకు అర్జెంటీనా టీమ్​లోని లియోనల్​ మెస్సీ అంటే ఎంతో ఇష్టం. ఆ అభిమానంతోనే తమ పిల్లాడికి ఇదిన్​ మెస్సీ అని నామకరణం చేసి సంబరాలు చేసుకున్నామని షానీర్​ తెలిపారు. తమ ఫేవరెట్​ టీమ్​ ఓటమి పాలైనందుకు నిరాశగా ఉన్నా తమ చిన్నారికి మెస్సీ అని పేరు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.

Kerala couple names their newborn Messi
చిన్నారి ఇదిన్​ మెస్సీ
Last Updated :Nov 25, 2022, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.