22 ఏళ్ల కల సాకారం.. KBCలో రూ.కోటి గెలుచుకున్న హౌస్​వైఫ్​

author img

By

Published : Sep 20, 2022, 10:42 AM IST

Updated : Sep 20, 2022, 10:47 AM IST

kbc season 14 1 crore winner KAVITA CHAWLA

ఆమె ఓ గృహిణి. చదివింది 12వ తరగతి. కౌన్​ బనేగా కరోడ్​పతి కార్యక్రమంలో విజేతగా నిలవాలని కలగన్నారు. 22 ఏళ్లుగా అదే లక్ష్యంతో ముందుకు సాగారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. రూ.కోటి గెలుచుకున్నారు.

KBC season 14 1 crore winner : బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ హోస్ట్​గా వ్యవహరిస్తున్న పాపులర్​ షో 'కౌన్​ బనేగా కరోడ్​పతి' సీజన్​ 14లో విజేతగా నిలిచారు ఓ గృహిణి. మహారాష్ట్ర కొల్హాపుర్​ జిల్లా గాంధీనగర్​కు చెందిన కవితా చావ్లా కేబీసీలో రూ.కోటి గెలుచుకున్నారు. ఈ విజయం వెనుక 22 ఏళ్ల నిరీక్షణ, శ్రమ ఉన్నట్లు ఈటీవీ భారత్​తో చెప్పారు కవిత.

ఉక్కు సంకల్పంతో..
KBC 14 winner Kavita Chawla : కవితా చావ్లా 12వ తరగతితో చదువు ఆపేశారు. వస్త్ర వ్యాపారం చేసే విజయ్​ చావ్లాతో ఆమెకు వివాహమైంది. అప్పటి నుంచి ఇంటి పనులకే పరిమితం అయ్యారు కవిత. అయితే.. 22 ఏళ్ల క్రితం ప్రారంభమైన కౌన్ బనేగా కరోడ్​పతి కార్యక్రమం ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. ఎలాగైనా ఆ షోలో పాల్గొనాలని, విజేతగా నిలవాలని కలలుగన్నారు కవిత. అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రోజూ ఇంటి పనులు పూర్తయ్యాక.. కేబీసీ కోసం సమయం కేటాయించేవారు. జనరల్ నాలెడ్జ్, కరెంట్​ అఫైర్స్​పై అవగాహన పెంచుకునేవారు.

2013లో తన కల దాదాపు నెరవేరిందని అనుకున్నారు కవిత. అప్పట్లో కేబీసీ టాప్​-10కు ఆమె ఎంపిక అయ్యారు. కానీ.. హాట్ సీట్​ వరకు వెళ్లకుండానే వెనుదిరిగారు. అయినా ఏమాత్రం నిరాశ చెందలేదు కవిత. తన ప్రయత్నాల్ని కొనసాగించారు. ఎట్టకేలకు సీజన్​-14లో హాట్​ సీట్​ వరకు వెళ్లారు. బాలీవుడ్​ సూపర్​స్టార్ అమితాబ్​ బచ్చన్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి.. రూ.కోటి గెలుచుకున్నారు. కవితా చావ్లా పాల్గొన్న ఎపిసోడ్​.. సోమ, మంగళవారాల్లో ప్రసారం అవుతోంది.

kbc season 14 1 crore winner KAVITA CHAWLA
కేబీసీలో గెలుచుకున్న చెక్కులతో కవిత

22 ఏళ్ల సాకారంతో అంతులేని ఆనందంతో మునిగిపోయింది కవితా చావ్లా కుటుంబం. షూటింగ్​ నుంచి ఆమె తిరిగి వచ్చే సమయానికి.. బ్యాండ్​ వాయిస్తూ, టపాసులు పేల్చుతూ సంబరాలు చేసుకుంది. "ప్రయత్నించే వారు ఎప్పటికీ ఓడిపోరు అని నిరూపితమైంది. రూ.కోటి గెలవడంకన్నా.. హాట్​ సీట్​లో అమితాబ్​ బచ్చన్​ ముందు కూర్చోవడం మర్చిపోలేని అనుభూతి" అని అన్నారు కవిత. కేబీసీ ద్వారా వచ్చిన డబ్బును.. తన భర్త వ్యాపారం కోసం తీసుకున్న అప్పులు తీర్చేందుకు, కుమారుడు బ్రిటన్​ వెళ్లి చదువుకునేందుకు ఖర్చు చేస్తామని చెప్పారు.

kbc season 14 1 crore winner KAVITA CHAWLA
ఈటీవీ భారత్​తో మాట్లాడుతున్న కవితా చావ్లా
Last Updated :Sep 20, 2022, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.