జీవచ్ఛవంలా చిన్నారి.. దేవుడి​పైనే ఆశలు.. ఈటీవీ భారత్​ కథనంతో...

author img

By

Published : Jun 23, 2022, 2:37 PM IST

Updated : Jun 23, 2022, 4:28 PM IST

Karnataka: Mother goes to Jesus with her son who is in a coma for prayer

కోమాలో ఉన్న తమ చిన్నారి ఎలాగైనా కోలుకోవాలన్నది ఆ తల్లిదండ్రుల ఆశ. ఎంతో మంది వైద్యులను సంప్రదించినా ఫలితం లేదు. చివరకు కదల్లేని స్థితిలో ఉన్న బాలుడిని వెంటపెట్టుకొని చర్చికి వెళ్లారు. ఈటీవీ భారత్​ ద్వారా చిన్నారి పరిస్థితి గురించి తెలుసుకున్న ఓ ఫేస్​బుక్​ గ్రూప్​ వారికి అండగా నిలిచింది.

జీవచ్ఛవంలా చిన్నారి.. దేవుడి​పైనే ఆశలు.. ఈటీవీ భారత్​ కథనంతో...

రోజూ స్కూల్​కు వెళ్తూ స్నేహితులతో ఉత్సాహంగా ఆడుకునే వయసులో ఓ చిన్నారి జీవచ్ఛవంలా మారాడు. బ్రెయిన్​ ఫీవర్​ కారణంగా పక్షవాతం బారినపడి.. ఆపై కోమాలోకి వెళ్లాడు. చిన్నారి ఆరోగ్యం బాగుపడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేని సమయంలో 'ఈటీవీ భారత్​' ప్రచురించిన ఓ కథనం ఆ చిన్నారికి అండగా నిలిచేలా చేసింది. సోషల్ ​మీడియాలోని ఓ గ్రూప్​ చిన్నారికి సాయం అందిస్తామంటూ ముందుకొచ్చింది.

ఉత్తర కన్నడ జిల్లా అంబర్దా గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల శైలేశ్​ కృష్ణ బ్రెయిన్​ ఫీవర్​ కారణంగా కొంతకాలంగా కోమాలో ఉంటున్నాడు. చిన్నారిని ఉత్తర కన్నడ సహా ధార్వాడ్​, హుబ్లీ జిల్లాల్లోని పలు ఆస్పత్రుల్లో చూపించారు. కానీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. మంగళవారం ఈ క్రమంలోనే చిన్నారి కుటుంబం.. శైలేశ్​ను నందగద గ్రామంలోని ఓ చర్చి వద్దకు తీసుకెళ్లి ప్రార్థించారు.

Karnataka: Mother goes to Jesus with her son who is in a coma for prayer
జీవచ్ఛవంలా మారిన చిన్నారిని చర్చికి తీసుకెళ్లి ప్రార్థనలు

ఈటీవీ భారత్​ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఫేస్​బుక్​ ఫ్రెండ్​ సర్కిల్​ గ్రూప్​.. చిన్నారికి అండగా నిలిచింది. బెళగావి జిల్లాలోని యష్​ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తోంది. శైలేశ్​కు నయమయ్యే వరకు అతని వైద్య ఖర్చులు తామే భరిస్తామని భరోసా కల్పించింది. మరోవైపు ఈ విషయం ప్రభుత్వం​ దృష్టికి కూడా వెళ్లింది. చిన్నారి చికిత్స కోసం తమ వంతు సాయం అందిస్తామని జిల్లా కలెక్టర్​ నితీశ్​ పటేల్ హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: యువకుడి హత్య.. రాళ్లతో నిందితులను కొట్టి చంపిన గ్రామస్థులు

కొంపముంచిన పిల్లాడు.. తండ్రి ఫోన్​లో ఆన్​లైన్ గేమ్.. రూ.39 లక్షలు గోవింద!

Last Updated :Jun 23, 2022, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.