గ్రామాన్ని ప్రైవేటు కంపెనీకి అమ్మేసిన సర్కారు.. స్థానికుల న్యాయపోరాటం

author img

By

Published : Nov 22, 2022, 10:57 AM IST

jharkhand-government-sold-village-to-private-company

ఆ ఊరిలోని భూవాదం ఓ కొలిక్కి రాకముందే సర్కారు దాన్ని ప్రైవేటు​ వ్యక్తుల చేతుల్లో పెట్టేసింది. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ గ్రామస్థులు కోర్టును ఆశ్రయించారు. తామకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు.

ఏ ఊర్లో అయినా భూతగాదాలు సాధారణంగా ఉండేవే. ఆస్తి పంపకాలు, సరిహద్దు వివాదాలు వంటివి మనం చూస్తూనే ఉంటుంటాం. కానీ ఝార్ఖండ్​లో ఓ గ్రామం పరిస్థితి మాత్రం భిన్నం. ప్రభుత్వమే వారి ఊరిని ప్రైవేటు కంపెనీకి అమ్మేసింది. గ్రామాన్ని కంపెనీ కొనుగోలు చేసిన విషయంపై 6 నెలల తర్వాతే గ్రామస్థులకు సమాచారం అందింది. కంపెనీ యాజమాన్యం.. గ్రామంలోని స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వచ్చినప్పుడు స్థానికులు షాక్​కు గురయ్యారు.

మరిన్ని వివరాలు ఇలా..
ఝర్ఖండ్​లోని పలామూలో భూవివాదాలు అధికం. ఇలాంటి ఓ వివాదంతో గర్వా జిల్లాలోని సునీల్ ముఖర్జీ నగర్‌ అనే గ్రామం అతలాకుతలమైపోయింది. ఆ వివాదాన్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వమే ఆ గ్రామాన్ని ప్రైవేటు కంపెనీకి అమ్మేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో గ్రామ ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పలామూ డివిజనల్ కమీషనర్ కోర్టులో కేసు వేశారు.

సుమారు 250 కుటుంబాలు.. 465 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సునీల్​ ముఖర్జీ నగర్​లో మూడు దశాబ్దాలుగా జీవిస్తున్నాయి. అయితే ఆ భూమంతా గ్రామంలోని ప్రజల ఆధీనంలో ఉన్నప్పటికీ వారి వద్ద సరైన డాక్యుమెంట్స్​ లేవు. దీంతో రోడ్డు, నీరు, విద్యుత్‌ వంటి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ వారికి గృహ నిర్మాణ పథకం లాంటి అనేక ప్రభుత్వ పథకాలు వస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు గ్రామాన్నే విక్రయించేసరికి వీరు ఆందోళన చెందుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.