దేశంలోనే తొలి శానిటరీ నాప్కిన్​ రహిత గ్రామం ఇది! ఇలా సాధ్యమైంది...

author img

By

Published : Jan 14, 2022, 3:35 PM IST

sanitary napkin free panchayat

Sanitary napkin free panchayat: దేశంలోనే తొలి శానిటరీ నాప్కిన్​ రహిత గ్రామంగా నిలిచింది కేరళ, ఎర్నాకులం జిల్లాలోని కుంబలంగి అనే ఓ చిన్న లంక గ్రామం. అవల్కాయి అనే కార్యక్రమం ద్వారా మహిళలు నాప్కిన్ల స్థానంలో మెన్​స్ట్రువల్​ కప్స్ వాడేలా అవగాహన కల్పిస్తూ ఈ ఘనతను సాధించారు.

Sanitary napkin free panchayat: 'కుంబలంగి'.. కేరళ ఎర్నాకులం జిల్లాలో ఓ చిన్న లంక గ్రామం. ఫహద్​ ఫాజిల్​ నటించిన 'కుంబలంగి నైట్స్'​ సినిమా ద్వారా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం దేశంలోనే శానిటరీ నాప్కిన్​ రహిత తొలి పంచాయతీగా నిలిచింది. 'అవల్కాయి(ఆమె కోసం)' అనే కార్యక్రమం ద్వారా రుతుస్రావం అయ్యే మహిళలు శానిటరీ నాప్కిన్​కు బదులుగా మెన్​స్ట్రువల్​ కప్స్​ను వాడేలా చేసి ఈ ఘనతను సాధించింది.

sanitary napkin free panchayat
కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్​ అరిఫ్​ ముహమ్మెద్​ ఖాన్

శానిటరీ నాప్కిన్​ల వాడకాన్ని పూర్తిగా తగ్గించేందుకు.. 'అవల్కాయి' కార్యక్రమాన్ని ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ సాయంతో అమలు చేశారు. రుతుస్రావం అయ్యే మహిళలకు మెన్​స్ట్రువల్​ కప్స్​ పంపిణీ చేసి వారు ఈ లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో నాప్కిన్​ రహిత గ్రామంగా నిలిచింది కుంబలంగి.

ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 5000కుపైగా మెన్​స్ట్రువల్​ కప్పులను పంపిణీ చేశారు. 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఈ కప్పులు ఇవ్వాలనేది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అలాగే.. శానిటరీ నాప్కిన్​తో పోలిస్తే మెన్​స్ట్రువల్​ కప్స్​ చాలా తక్కువ ధరకే లభించటం, పర్యావరణహితంగా ఉండటం వంటి ఉపయోగాలపై మహిళలకు అవగాహన కల్పించారు.

ఇటీవల కుంబలంగిలో నిర్వహించి ఓ కార్యక్రమంలో శానిటరీ నాప్కిన్​ రహిత గ్రామంగా ప్రకటించారు ఆ రాష్ట్ర గవర్నర్​ అరిఫ్​ ముహమ్మెద్​ ఖాన్​.

sanitary napkin free panchayat
మహిళలతో మాట్లాడుతున్న గవర్నర్​ అరిఫ్​ ముహమ్మెద్​ ఖాన్

ఇదీ చూడండి:

విద్యార్థినులకు శానిటరీ న్యాప్కిన్స్​ వినియోగంపై అవగాహన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.