Covid cases in India: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

author img

By

Published : Oct 14, 2021, 9:53 AM IST

Corona cases

భారత్​లో ఒక్కరోజే 18,987‬ మంది​కి (Covid cases in India) వైరస్​ సోకింది. మరో 246 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19,808 మంది కరోనాను జయించారు.

దేశంలో కరోనా(Coronavirus update) కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 18,987 మంది​కి కరోనా (Coronavirus update) పాజిటివ్​గా తేలింది. కొవిడ్​ ధాటికి(Covid cases in India) మరో 246 మంది మరణించారు. ఒక్కరోజే 19,808 మంది రికవరీ అయ్యారు.

  • మొత్తం కేసులు: 3,40,20,730
  • మొత్తం మరణాలు: 4,51,435
  • మొత్తం కోలుకున్నవారు: 3,33,62,709
  • యాక్టివ్ కేసులు: 2,06,586

పరీక్షలు

అక్టోబరు 13న 13,01,083 కరోనా​ పరీక్షలు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 58,76,64,525కు చేరింది.

టీకాల పంపిణీ

బుధవారం ఒక్కరోజే 35,66,347 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 96,82,20,997కు చేరినట్లు చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 4,40,664 మందికి వైరస్ ​(Corona update) సోకింది. కొవిడ్​​ ధాటికి మరో 7,506 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,99,37,425కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,89,385కు పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 99,775 మందికి వైరస్​ సోకింది. మరో 1,819 మంది వైరస్​​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో క్రితం రోజుతో పోల్చుకుంటే కొవిడ్​ కేసుల్లో కాస్త పెరిగాయి. కొత్తగా 42,776 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. అయితే మరణాల సంఖ్య తగ్గింది. తాజాగా 136 మృతి చెందారు.
  • టర్కీలో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. ఒక్కరోజే 31,248 మందికి వైరస్​ బారిన పడగా.. 236 మంది మరణించారు.
  • రష్యాలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. తాాజాగా 28,717 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజే 984 మంది వైరస్​ ధాటికి మృతి చెందారు.
  • ఇరాన్​లో కొత్తగా 12,298 మందికి కొవిడ్​ సోకగా.. 194 మంది చనిపోయారు.
  • బ్రెజిల్​లో తాజాగా 7,852 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 201 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: బడి చదువులపై కరోనా పంజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.