భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా14,313 మందికివైరస్​

author img

By

Published : Oct 12, 2021, 9:54 AM IST

Covid cases

భారత్​లో తాజాగా 14,313 మంది​ కరోనా బారిన (Coronavirus update) ​పడ్డారు. కొవిడ్​ ధాటికి(Covid cases in India) మరో 181 మంది మృతి చెందారు. మరో 21వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దేశంలో కరోనా(Coronavirus update) కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 14,313 మంది​కి (Covid cases in India) వైరస్​ సోకింది. మరో 181 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26,579 మంది కరోనాను జయించారు.

  • మొత్తం కేసులు: 3,39,85,920
  • మొత్తం మరణాలు: 4,50,963
  • మొత్తం కోలుకున్నవారు: 3,33,20,057
  • యాక్టివ్ కేసులు: 2,14,900

పరీక్షలు

అక్టోబరు 11న 11,81,766 కొవిడ్​ పరీక్షలు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 58,50,38,043కు చేరింది.

వ్యాక్సినేషన్​..

సోమవారం కొత్తగా 65,86,092 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 95,89,78,049కు చేరినట్లు చెప్పింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 3,15,153 మందికి కరోనా (Corona update) పాజిటివ్​గా తేలింది. వైరస్​ ధాటికి మరో 4,657 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,90,27,175కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,72,739కి పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికా - 50,466
  • బ్రిటన్ - 40,224
  • టర్కీ - 30,563
  • రష్యా - 29,409
  • ఇరాన్ - 13,504
  • బ్రెజిల్ - 6,918

ఇదీ చూడండి: కొవిడ్‌ చికిత్సకు మధుమేహం, ఊబకాయ ఔషధాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.