దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి.. మరో 2.64 లక్షల మందికి వైరస్​

author img

By

Published : Jan 14, 2022, 9:16 AM IST

Updated : Jan 14, 2022, 9:32 AM IST

India corona cases today

Covid cases in India: భారత్​లో కొత్త కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. మరో 2,64,202 మందికి వైరస్​ సోకింది. మరో 315 మంది వైరస్​కు బలయ్యారు. 1,09,345 మంది కొవిడ్​ను జయించారు.

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,64,202 కేసులు నమోదయ్యాయి. వైరస్​ ధాటికి మరో 315 మంది మరణించారు. 1,09,345 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 36,582,129
  • మొత్తం మరణాలు: 4,85,350
  • యాక్టివ్ కేసులు: 12,72,073
  • మొత్తం కోలుకున్నవారు: 3,48,24,706

Omicron Cases In India

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 73,08,669 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,55,39,81,819కు చేరింది.

అంతర్జాతీయంగా..

corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 31,86,254 మందికి కరోనా సోకింది. 7,606 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 32,08,96,639కి చేరగా.. మరణాలు 55,39,078కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 8,06,493 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 1,969 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 65,236,475 దాటింది.
  • ఫ్రాన్స్​లో బుధవారం ఒక్కరోజే 3,05,322 కేసులు వెలుగుచూశాయి. మరో 225 మంది చనిపోయారు.
  • బ్రిటన్​లో మరో 1,09,133 మంది వైరస్ బారిన పడ్డారు.​ 335 మంది మృతి చెందారు.
  • ఇటలీలో 1,84,615 కొత్త కేసులు బయటపడగా.. 316 మంది మరణించారు.
  • స్పెయిన్​లో 1,59,161 మందికి కొత్తగా వైరస్​ సోకింది. మరో 112 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:

చైనా క్రూరత్వం.. ఇనుప పెట్టెల్లో కొవిడ్ బాధితులు.. ముగ్గురికి జైలు

Last Updated :Jan 14, 2022, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.