ఫోన్​ కొనడానికి డబ్బులు లేవని ఐజీ రివాల్వర్​ చోరీ!

author img

By

Published : Nov 25, 2022, 9:27 PM IST

Bihar IG service revolver stolen

కొత్త ఫోన్​ కొనడానికి డబ్బులు లేవని ఐజీ రివాల్వర్​నే కాజేశాడు ఓ దొంగ. తన ఇంట్లో పనిచేసే వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

బిహార్​ ఐజీ రివాల్వర్​ చోరీకి గురైంది. తన ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తే ఈ దొంగతనం చేసినట్లు ఐజీ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. కొత్త ఫోన్​ కొనడానికి డబ్బులు లేనందునే నిందితుడు.. రివాల్వర్​ కాజేసి తన స్నేహితుడికి విక్రయించినట్లు చెప్పారు. దొంగని అరెస్ట్​ చేసిన పోలీసులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.

అసలు ఏం జరిగిందంటే..
పట్నాకు చెందిన ఇన్​స్పెక్టర్​ జనరల్​ ఆఫ్​ పోలీస్ వికాశ్​ వైభవ్​ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో సెల్ఫ్​లో ఉంచిన రివాల్వర్​, 25 బుల్లెట్​లు చోరీ జరిగినట్లు ఐజీ వెల్లడించారు. దీనిపై ఐజీ గార్దానీబాగ్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఐజీ ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఐజీ ఇంట్లో పనిచేసే సూరజ్​ కుమార్​పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కుమార్​ను విచారించగా తానే ఈ దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. కొత్త ఫోన్ కొనడానికి డబ్బులు లేనందునే దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. దొంగిలించిన అనంతరం దాన్ని ఉద్దాన్​ ప్రాంతానికి చెందిన తన మిత్రుడు.. సుమిత్​కు విక్రయించినట్లు తెలిపాడు.

"ఈ రోజు ఉదయం నా సర్వీస్​ రివాల్వర్​ కనిపించలేదు. నా భార్యను ఈ విషయం అడగగా తనకి తెలియదని చెప్పింది. మా ఇంట్లో పనిచేసే సూరజ్ కుమార్ అనుమానాస్పదంగా నా గది నుంచి బయటకు వస్తున్నట్లు నాకు తెలిసింది. నా గదిలోకి ప్రవేశం ఉన్న బయట వ్యక్తి సూరజ్​ ఒక్కడే. అందుకే అతన్ని విచారించగా అసలు విషయం బయటపడింది."
-- వికాశ్​ వైభవ్​, బిహార్​ ఐజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.