హెచ్​ఐవీ రక్తాన్ని శరీరంలోకి ఎక్కించుకున్న యువతి.. ఎందుకో తెలిస్తే షాక్​!

author img

By

Published : Aug 5, 2022, 8:09 PM IST

Etv Bharat

ప్రేమ కోసం ఎంతోమంది ఎన్నో రకాల త్యాగాలు చేసేవాళ్ల గురించి మనం వినే ఉంటాం. ప్రేమకు అడ్డువచ్చిన వారిని చంపడానికి.. లేదా వారే స్వయంగా తనువు చాలించిన వాళ్లనూ చూసి ఉంటాం. కానీ ప్రేమించిన వ్యక్తి కోసం అసోంకు చెందిన ఓ యువతి హెచ్​ఐవీ వైరస్​ ఉన్న తన ప్రియుడి రక్తాన్ని శరీరంలోకి ఎక్కించుకుంది. అసలు ఆమె ఎందుకు అలా చేసిందంటే?

HIV Positive Lovers: అసోంకు చెందిన ఓ యువతి.. తన ప్రియుడి కోసం ఎవరూ చేయని సాహసం చేసింది. ప్రేమికుడి నుంచి ఎవరూ తనను దూరం చేయకూడదని హెచ్​ఐవీ ఉన్న తన లవర్​ రక్తాన్ని.. శరీరంలోకి ఎక్కించుకుంది. ఈ విషయం తెలిసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
అసలేం జరిగిందంటే?.. కామ్​రూప్​ జిల్లాలోని సువల్​కచి గ్రామానికి చెందిన ఆ యువతికి (19).. పక్క గ్రామానికి చెందిన ఓ యువకుడితో మూడేళ్ల క్రితం ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో మునిగితేలారు. అయితే ఆ యువకుడు హెచ్ఐవీ వైరస్​తో పోరాడుతున్నాడు. అది తెలిసి కూడా యువతి తన లవర్​తో మూడు సార్లు గ్రామాన్ని విడిచి పారిపోయింది. కానీ ప్రతిసారి ఆమె కుటుంబసభ్యులు వారిని వెతికి తీసుకొచ్చారు.

సిరంజి సహాయంతో.. అది తట్టుకోలేకపోయిన ఆ యువతి.. సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. సిరంజితో తన బాయ్‌ఫ్రెండ్​ రక్తాన్ని శరీరంలోకి ఎక్కించుకుంది. విషయం తెలిసిన యువతి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం యువతికి పోలీసులు.. వైద్య పరీక్షలు జరిపించగా హెచ్​ఐవీ రక్తాన్ని ఎక్కించుకున్నట్లు నిర్ధరణ అయింది.
'అందుకే ఆ పని చేశా'.. స్థానిక మీడియాతో మాట్లాడిన యువతి.. తాను ప్రియుడి రక్తాన్ని ఎక్కించుకున్నట్లు తెలిపింది. ఇక తనను ఎవరూ తన ప్రియుడి నుంచి వేరుచేయలేరని చెప్పింది. తన ప్రేమను బతికించుకునేందుకే ఈ పనిచేసినట్లు పేర్కొంది. జైలులో ఉన్న తన ప్రియుడు అమాయకుడు అని.. అతడ్ని విడిచిపెట్టాలని కోరింది.

ఇవీ చదవండి: నాలుగో అంతస్తు నుంచి కూతుర్ని తోసేసిన తల్లి.. 40 అడుగుల బావిలో నవజాత శిశువు

60 గోమాతలు మృతి.. ఘటనపై యోగి సీరియస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.