బెయిల్ కోసం కోర్టుకు నాలుగేళ్ల బాలుడు.. బారికేడ్లు ధ్వంసం చేశాడట!

author img

By

Published : Mar 17, 2023, 12:06 PM IST

four-year-old-child-went-court-to-get-bail-police-registered-case-on-child

బెయిల్​ కోసం ఓ నాలుగేళ్ల బాలుడు కోర్టుకు వెళ్లాడు. 2021 ఏప్రిల్​ తనపై నమోదైన కేసులో భాగంగా బాలుడు కోర్టు తలుపు తట్టాడు. ఈ విచిత్ర ఘటన బిహార్​లో జరిగింది.

ఓ నాలుగేళ్ల బాలుడు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లాడు. రెండు సంవత్సరాల క్రితం తనపై.. నమోదైన కేసులో భాగంలో బెగుసరాయ్​ జిల్లా కోర్టు తలుపు తట్టాడు. 2021 ఏప్రిల్​లో.. కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘన పేరుతో బాలుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా కట్టడి కోసం పోలీసులు ఏర్పాటు చేసిన.. బారికేడ్లను బాలుడు ధ్వంసం చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. దీంతో బెయిల్​ కోసం తన తల్లితో కలిసి గురువారం తల్లితో కలిసి కోర్టుకు వెళ్లాడు ఈ నాలుగేళ్ల బాలుడు. బిహార్​లో ఈ వింత ఘటన జరిగింది.

బెగుసరాయ్ జిల్లాలోని సుజా గ్రామానికి చెందిన బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఫాసిల్ పోలీసు స్టేషన్​లో ఈ కేసు నమోదైంది. బాలుడితో పాటు మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2021 ఏప్రిల్​లో కరోనా కట్టడి కోసం బారికేడ్లు ఏర్పాటు చేస్తే.. వాటిని వీరంతా ధ్వంసం చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. కరోనా వ్యాప్తికి వీరు కారణమయ్యారనే నెపంతో ఆ ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కోర్టు ఆదేశాలు..
ఈ కేసును విచారించిన బెగుసరాయ్​ కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంత చిన్న పిల్లలపై కేసు పెట్టడానికి గానీ, బెయిల్​ ఇవ్వడానికి కానీ ఎటువంటి నిబంధనలు లేవని తెలిపింది. బాలుడిపై కేసు కొట్టివేయాలని పోలీసులను ఆదేశించింది. బాలుడు, ఆమె తల్లిని ఇంటికెళ్లాలని సూచించింది. "చిన్నారికి రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు అతనిపై కేసు నమోదైంది. దీంతో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాం. దీనిపై విచారించిన కోర్టు.. బాలుడిపై నమోదైన కేసును కొట్టివేయాలని పోలీసులకు ఆదేశించింది.' అని బాలుడి తరుపు లాయర్​ తెలిపారు.

అన్నం అడిగితే అమ్మ కొడుతోంది..
గతేడాది సెప్టెంబరులో 'అన్నం అడిగితే అమ్మ కొడుతోంది. వేళకు అన్నం పెట్టదు. ఒక్కోసారి నేను తింటుంటే పళ్లెం లాక్కొని విసిరేస్తుంది సార్‌' అంటూ తల్లిపై 8 ఏళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాలుడి ధైర్యాన్ని చూసి.. పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బిహార్​లో ఈ ఘటన జరిగింది. ముందుగా బాలుడికి కడుపు నిండా అన్నం పెట్టిన పోలీసులు.. తర్వాత అతడి నుంచి వివరాలు ఆరా తీశారు.

తాను నాలుగో తరగతి చదువుతున్నానని, నాన్న మరోచోట ఉంటాడని బాలుడు పోలీసులకు తెలిపాడు. చెప్పిన చిరునామా ప్రకారం పోలీసులు ఆ బాలుణ్ని ఇంటికి తీసుకువెళ్లారు. తల్లిని విచారించగా.. అలాంటిదేం లేదని, ఒక్కోసారి అల్లరి చేస్తే తిడుతుంటానని ఆమె చెప్పారు. ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి తాము వెనుదిరిగినట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.