ఆస్పత్రి వద్ద క్షుద్రపూజలు.. చనిపోయిన పప్పూ ఆత్మను సీసాలో బంధించాలని...

author img

By

Published : May 11, 2022, 3:04 PM IST

Updated : May 12, 2022, 2:29 PM IST

Family Reaches Hospital With Tantrik in Rajasthan to Retrieve the Child's Soul

Family Reaches Hospital With Tantrik: చనిపోయిన తర్వాత మనిషి ఆత్మగా మారి పగ తీర్చుకోవడం లేదా తమ కుటుంబాలను రక్షించుకోవడం వంటివి సినిమాల్లో చూస్తుంటాం. వాటిని బంధించేందుకు తాంత్రికులతో పూజలు చేయించడమూ తెలిసిందే. రాజస్థాన్​ అజ్మేర్​లోని ఓ ఆస్పత్రి ముందు అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది.

ఆసుపత్రి వద్ద పూజలు చేస్తున్న కుటుంబసభ్యులు

Family Reaches Hospital With Tantrik: సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నా.. ఇప్పటికీ ఎక్కడో చోట మూఢనమ్మకాలను జనం విశ్వసిస్తూనే ఉన్నారు. సినిమాల్లోనూ ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనే రాజస్థాన్​ అజ్మేర్​లోని ఓ ఆస్పత్రి ముందు కనిపించింది. ఎప్పుడో 13 ఏళ్ల కిందట చనిపోయిన కుమారుడి ఆత్మను బంధించాలని తాంత్రికుడితో సహా ఆస్పత్రి ముందు ప్రత్యక్షమైంది ఓ కుటుంబం. పిల్లల వార్డు బయట.. హడావుడిగా పూజలు చేస్తూ కనిపించారు మృతుడి కుటుంబసభ్యులు. ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని.. జనం భారీగా గుమిగూడారు.

Family Reaches Hospital With Tantrik in Rajasthan to Retrieve the Child's Soul
ఆస్పత్రి పిల్లల వార్డు ముందు తాంత్రికుడితో పూజలు
Family Reaches Hospital With Tantrik in Rajasthan to Retrieve the Child's Soul
గుమిగూడిన జనం

అసలేమైందో వారు చెప్పింది వింటే సినిమా కథలా ఉందనక మానరు. చనిపోయిన పిల్లాడు ఆత్మలా మారి తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చెప్పుకొచ్చారు ఆ ఇంటి పెద్ద నాథూలాల్​. ఏం చేయాలో తెలియక తాంత్రికుడిని తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

'మా మనవడు పప్పూ కొన్నేళ్ల కిందట చనిపోయాడు. అనారోగ్యంతో జేఎల్​ఎన్​ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత మా కుటుంబం కష్టాల్లో మునిగిపోయింది. కొన్నిసార్లు పంటలు నాశనమయ్యాయి. కొన్నిసార్లు పశువులు చనిపోయాయి. కుటుంబంలో అంతా తరచూ అస్వస్థతకు గురవుతున్నారు.'' అని చెప్పారు.
ఆస్పత్రి ముందు పూజలు చేస్తున్నా.. ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. పోలీసులు, వైద్యులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిసేపటి అనంతరం వారంతా తిరిగి తమ గ్రామానికి వెళ్లారు.

ఇవీ చూడండి: మంత్రి కోడలు ఆత్మహత్య! ఆ వ్యవహారమే కారణం!!

అమ్మో.. ఒకే ఇంట్లో 90 కోబ్రాల మకాం!

Last Updated :May 12, 2022, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.