ఐసీయూలో రోగికి 'భూతవైద్యుడి' ట్రీట్​మెంట్​.. డాక్టర్లంతా అక్కడే ఉన్నా..

author img

By

Published : Aug 3, 2022, 1:42 PM IST

exorcism in icu of gumla sadar hospital

పాము కాటుకు గురైన ఓ మహిళకు ఆమె కుటుంబసభ్యులు.. ఆసుపత్రి ఐసీయూలోనే భూతవైద్యం చేయించారు. ఆ సమయంలో.. డాక్టర్లంతా అక్కడే ఉన్నా కనీసం అడ్డుకోలేదు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

ఐసీయూలో 'పాము కాటు' పేషెంట్​కు భూతవైద్యుడి ట్రీట్​మెంట్​

Exorcism In Hospital ICU: ప్రపంచమంతా గ్లోబల్‌ విలేజ్‌గా మారినా.. కొందరు మూఢనమ్మకాలపై అపోహలు మాత్రం వీడటం లేదు. ప్రస్తుత ఆధునిక యుగంలో కూడా భూతవైద్యాన్ని నమ్మేవారు ఇంకా ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఝార్ఖండ్​లో వెలుగు చూసింది. పాము కాటుకు గురై ఐసీయూలో చికిత్స పొందుతోన్న ఓ మహిళకు భూతవైద్యుడితో వైద్యం చేయించారు ఆమె కుటుంబసభ్యులు. అయితే ఆ సమయంలో ఆసుపత్రి యాజమాన్యం వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం.

ఆంబువా ప్రాంతానికి చెందిన శక్తి నాయక్​ భార్య అర్చన దేవి(25) పాము కాటుకు గురైంది. వెంటనే బంధువులు.. ఆమెను గుమ్లా సదర్​ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు.. మెరుగైన చికిత్స కోసం రిమ్స్​కు రిఫర్​ చేశారు. వారు మాత్రం రిమ్స్​కు వెళ్లకుండా.. సదర్​ ఆసుపత్రికి ఓ భూతవైద్యుడ్ని పిలిపించారు. ఆసుపత్రి.. ఐసీయూ బ్లాక్​లోకి వచ్చిన భూత వైద్యుడు.. సుమారు మూడు గంటలపాటు హైడ్రామా నడిపించాడు. అన్నం తినే ప్లేట్​ను బాధితురాలి వీపు మీద పెట్టి ఏవో పూజలు చేశాడు. ఆమె శరీరం నుంచి విషం తీసినట్టుగా కాసేపు గిమ్మిక్కులు కూడా చేశాడు. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో.. సదర్​ ఆసుపత్రి వైద్యులంతా అక్కడే ఉండి చూస్తూనే ఉన్నారు తప్ప ఏమీ అనలేదు.

గుమ్లా సదర్ ఆస్పత్రిలో ఇలాంటి ఘటన జరగడం ఇదేం తొలిసారి కాదు. మూడు రోజుల క్రితం పాముకాటుకు గురైన ఓ చిన్నారిని అతడి కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారు కూడా భూతవైద్యుడ్ని పిలిపించి ఆసుపత్రి ఆవరణలోనే భూతవైద్యం చేయించారు.

ఇవీ చదవండి: తల్లి మృతదేహం పక్కనే చిన్నారి నిద్ర.. 5గంటలు అలాగే... ఆకలేస్తోందని విలపిస్తూ..

12ఏళ్ల బాలికపై రేప్.. 27ఏళ్ల తర్వాత నిందితుడు అరెస్ట్.. మైనర్​పై నలుగురు కలిసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.