నకిలీ సీఎం అరెస్ట్​.. శిందే వేషధారణలో నేరస్థులతో ఫొటోలు..

author img

By

Published : Sep 20, 2022, 1:44 PM IST

Updated : Sep 20, 2022, 2:17 PM IST

duplicate eknath shinde

Duplicate Eknath Shinde: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే వేషధారణలో నేరస్థులతో ఫొటోలు దిగుతున్నాడు ఓ వ్యక్తి. అనంతరం వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి.. శిందే గౌరవానికి భంగం కలిగిస్తున్నాడు. దీంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు వేరొకరి పేరుతో ఉన్న లా లైసెన్స్​ను ఉపయోగించి.. ఓ 72 ఏళ్ల మహిళ కోర్టులో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

Duplicate Eknath Shinde: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే వేషధారణలో ప్రజలను మోసగిస్తున్నాడు పుణెకు చెందిన విజయ్ మానే అనే వ్యక్తి. శిందే గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా శిందే వేషదారణలో బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లిన అతడు.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. అలాగే నేరస్థుడు శరద్ మోహోల్​తో సీఎం ఏక్​నాథ్ శిందే ఫొటోలు దిగినట్లు సోషల్ మీడియాలో షేర్​ చేశాడు. దీంతో నిందితుడు విజయ్​ మానేపై బండ్‌గార్డెన్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

నిందితుడు విజయ్.. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఓ ఫొటోలో సీఎం శిందే నిలబడి ఉండగా.. నేరస్థుడు శరద్ మోహల్ కుర్చీలో కూర్చునట్లు కనిపించాడు. నిందితుడు విజయ్ మానే నిత్యం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేలా దుస్తులు ధరించి పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఓ నేరస్థుడితో సత్రంలో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సీఎం శిందే ప్రతిష్ఠను దెబ్బ తీసేలా నిందితుడు విజయ్ మానే ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నకిలీ లా లైసెన్స్​తో.: లా డిగ్రీ, లైసెన్స్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న 72 ఏళ్ల మహిళను బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా వృద్ధురాలు గత ఏడేళ్లుగా బాంద్రా ఫ్యామిలో కోర్టులో ప్రాక్టీస్ చేస్తోందని తెలిపారు. నిందితురాలిని కాశీనాథ్ సోహోనిగా గుర్తించారు. ఆమెపై ఈ ఏడాది జూన్ 9న కేసు నమోదైంది.

నిందితురాలు 2015లో మూడుసార్లు, 2021లో రెండుసార్లు బాంద్రా ఫ్యామిలీ కోర్టులో న్యాయవాదిగా హాజరైంది. బాధితురాలి వేరొకరి పేరుతో ఉన్న లైసెన్స్​ను ఉపయోగిస్తోంది. వివిధ కోర్టుల్లో న్యాయవాదిగా హాజరై ప్రజలతో పాటు న్యాయవ్యవస్థనూ మోసం చేసింది. పోలీసుల విచారణకు అంగీకరించట్లేదు.

-- పోలీసులు

సల్మాన్ పాటలను అనుకరిస్తూ..: సల్మాన్‌ ఖాన్‌ను పోలిన ఆజం అలీ అన్సారీ అనే వ్యక్తి ఆర్​పీఎఫ్​ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 'డూప్లికేట్ సల్మాన్ ఖాన్'గా ప్రసిద్ధి చెందిన అన్సారీ ఆగస్టు 23న ఉత్తర్​ప్రదేశ్ దాలిగంజ్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పడుకుని సల్మాన్ ఖాన్ పాట 'తేరే నామ్ హమ్నే కియా హై'ను అనుకరిస్తూ వీడియో చేశాడు. ఈ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్​ కావడం వల్ల అన్సారీపై ఆర్​పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అన్సారీ పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తుండగా.. లఖ్​నవూలో ఆర్​పీఎఫ్ అధికారుల ఎదుట సోమవారం లొంగిపోయాడు. అనంతరం అధికారులకు క్షమాపణలు చెప్పాడు. 'రైల్వే ట్రాక్‌లు, పరిసర ప్రాంతాల్లో అటువంటి వీడియోలు తీయడం విరుద్ధమని' ఆర్​పీఎఫ్ అధికారులు తెలిపారు.

duplicate eknath shinde
అన్సారీ

ఇవీ చదవండి: అయోధ్యలో 251మీటర్ల రాముడి ప్రతిమ.. ఐక్యతా విగ్రహాన్ని మించి..

22 ఏళ్ల కల సాకారం.. KBCలో రూ.కోటి గెలుచుకున్న హౌస్​వైఫ్​

Last Updated :Sep 20, 2022, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.