'డ్రీమ్​ 11'తో లైఫ్​ టర్న్​- ఒక్క రాత్రిలో రూ.కోటి గెల్చుకున్న ప్లంబర్​!

author img

By

Published : Oct 13, 2021, 7:39 PM IST

Updated : Oct 13, 2021, 10:32 PM IST

katihar-plumber-became-millionaire-by-playing-dream-eleven

అదృష్టం అంటే అతడిది. ప్లంబర్​ పని చేసే వ్యక్తి.. రాత్రికి రాత్రే మిలియనీర్​గా మారాడు. అక్షరాలా కోటి రూపాయలు అతడి వశమయ్యాయి. క్రికెట్​ బెట్టింగ్​ యాప్​ డ్రీమ్​11తోనే ఇదంతా సాధ్యమైంది. ఎలా గెల్చుకున్నాడో, ఎవరిపై బెట్​ వేశాడో చూడండి.

రాత్రికి రాత్రే మిలియనీర్​గా మారిన ప్లంబర్​

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​​​.​. ఓ ప్లంబర్​ జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడయ్యాడు. అంతా క్రికెట్​ బెట్టింగ్​ యాప్​ డ్రీమ్​ 11 మాయ. అక్టోబర్​ 10న.. చెన్నై సూపర్​ కింగ్స్​, దిల్లీ క్యాపిటల్స్​ మధ్య జరిగిన క్వాలిఫయర్​-1 మ్యాచ్​పై బెట్​ వేయగా.. అదృష్టం అతడి తలుపుతట్టింది. ఏకంగా.. కోటి రూపాయల ప్రైజ్​ మనీ గెల్చుకున్నాడు. అతడే బిహార్​ కటిహార్​ జిల్లా మనిహారీకి చెందిన బబ్లూ మండల్​.

DREAM 11 APP: katihar-plumber-became-millionaire-by-playing-dream-eleven
డ్రీమ్​11లో రూ.కోటి గెల్చుకున్న బబ్లూ మండల్​

బబ్లూ.. హంస్​వర్​ గ్రామంలో ప్లంబింగ్​ పనులు చేసేవాడు. ఈ క్రమంలోనే తనతో పనిచేసే మరో వ్యక్తి ద్వారా డ్రీమ్ ​11 గురించి తెలుసుకున్నాడు. కొద్దిరోజుల్లోనే అదృష్టం వరించింది. డ్రీమ్​ 11 బృందం.. తనకు అభినందనలు కూడా తెలిపిందని పేర్కొన్నాడు బబ్లూ. ఈ డబ్బుతో మొదట మంచి ఇల్లు కట్టుకుంటానని అంటున్నాడు. మరికొంత ధనాన్ని ఓ దేవాలయానికి విరాళంగా ఇస్తానని చెప్పాడు.

DREAM 11 APP
డ్రీమ్​11లో బబ్లూ పెట్టిన టీం ఇదే..

''నాతో పని చేసే అతను.. డ్రీమ్​ 11 గురించి చెప్పాడు. నాకు అప్పటివరకు అసలేం తెలియదు. నా ఫోన్​లో ఆ వ్యక్తే యాప్​ ఇన్​స్టాల్​ చేశాడు. కొద్దిరోజుల క్రితమే నేను అది వాడటం మొదలుపెట్టా. మొదట రూ.200 పెట్టాను. ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు గెల్చుకున్నాను. రూ. 30 లక్షలు పన్ను రూపంలో కట్​ చేశారు. 70 లక్షలు నాకు వచ్చాయి.''

- బబ్లూ మండల్​

కొద్దిరోజుల కింద బిహార్​ మధుబనీకి చెందిన అశోక్​ కుమార్​కు కూడా ఇలానే జరిగింది. చిన్న సెలూన్​ షాప్​ నడిపే.. అతడికి డ్రీమ్​ 11 ద్వారా రూ. కోటి రూపాయలు వచ్చాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇదీ చూడండి: ఒకేసారి 550 కేక్స్​ కట్ చేసి పుట్టిన రోజు వేడుక

Last Updated :Oct 13, 2021, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.