ఇంజినీరింగ్ అర్హతతో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

author img

By

Published : May 24, 2023, 8:41 AM IST

Updated : May 24, 2023, 8:52 AM IST

DFCCIL recruitment 2023 Notification

DFCCIL recruitment 2023 : మీరు ఇంజినీరింగ్ పూర్తి చేశారా? ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్. భారత ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు మీకోసం.

DFCCIL recruitment 2023 : డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్​సీసీఐఎల్) నిరుద్యోలకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన డీఎఫ్​సీసీఐఎల్​లో భారీగా ఉద్యోగాలకు నగారా మోగింది. ఏకంగా 535 ఎగ్జిక్యూటివ్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులకు డీఎఫ్​సీసీఐఎల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి.. ఈ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు, వయో పరిమితి, పరీక్షా తేదీ, రుసుము తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

DFCCIL vacancy : డీఎఫ్​సీసీఐఎల్ భర్తీ చేయనున్న ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంజినీరింగ్​కు సమానమైన డిగ్రీ పట్టాను పొందినవారు కూడా ఈ జాబ్స్​‎కు దరఖాస్తు చేసేందుకు అర్హులే. ఈ ఉద్యోగాలకు మే 20వ తేదీ నుంచి జూన్ 19వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు. డీఎఫ్​సీసీఐఎల్ అధికారిక వెబ్​సైట్​కు వెళ్లి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

తప్పులకు అవకాశం ఇవ్వొద్దు
డీఎఫ్​సీసీఐఎల్ పోస్టులకు అప్లై చేసేముందు సంస్థ రిలీజ్ చేసిన నోటిఫికేషన్​ను జాగ్రత్తగా చదవాలి. అధికారిక నోటిఫికేషన్ పీడీఎఫ్​ను పూర్తిగా చదివితే సరిపోతుంది. వయో పరిమితి, విద్యార్హతలు తదితర విషయాలు నోటిఫికేషన్​ను క్షుణ్నంగా చదివితే తెలుస్తాయి. ఆ తర్వాత దరఖాస్తు చేస్తే తప్పులకు ఆస్కారం ఉండదు. డీఎఫ్​సీసీఐఎల్ చేపడుతున్న ఈ రిక్రూట్​మెంట్​కు సంబంధించిన నోటిఫికేషన్​ను తమ అధికారిక వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచింది.

అక్కడే అప్లై చేసుకోండి
డీఎఫ్​సీసీఐఎల్ భర్తీ చేయనున్న ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నేరుగా సంస్థ వెబ్​సైట్​కు వెళ్లి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పోస్టుల వారీగా డీఎఫ్​సీసీఐఎల్ భర్తీ చేయనున్న ఖాళీలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సివిల్ విభాగంలో 50 మంది ఎగ్జిక్యూటివ్​లను భర్తీ చేసేందుకు డీఎఫ్​సీసీఐఎల్ సిద్ధమవుతోంది. ఎలక్ట్రికల్ విభాగంలో 30, ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్​మెంట్ విభాగంలో 235, ఫైనాన్స్ విభాగంలో 14, హెచ్ఆర్ విభాగంలో 19, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 6 మంది ఎగ్జిక్యూటివ్స్​ను భర్తీ చేయనున్నారు.

భారీగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఎగ్జిక్యూటివ్స్​తో పాటు పలు విభాగాల్లో భారీగా జూనియర్ ఎగ్జిక్యూటివ్స్​ను తీసుకునేందుకు డీఎఫ్​సీసీఐఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్ విభాగంలో 24, సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్ విభాగంలో 148, మెకానికల్ విభాగంలో 9 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది డీఎఫ్​సీసీఐఎల్. ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఎంపిక ప్రక్రియ, జీతం తదితర విషయాలు పూర్తిగా నోటిఫికేషన్​లో అందుబాటులో ఉంటాయి.

Last Updated :May 24, 2023, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.