దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు.. జపాన్​లో 2 లక్షలకు పైనే!

author img

By

Published : Aug 5, 2022, 9:37 AM IST

covid cases

Covid Cases In India: భారత్​లో కొవిడ్​ కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 20,551 మంది వైరస్ బారిన పడగా.. 70 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు జపాన్​లో 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం మధ్య 20,551 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 5.14 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 21,595 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.31శాతంగా ఉన్నాయి.

  • మొత్తం కేసులు : 4,40,40,362
  • మొత్తం మరణాలు: 5,26,600
  • యాక్టివ్​ కేసులు: 1,35,364
  • కోలుకున్నవారి సంఖ్య: 4,34,45,624

Vaccination India:
భారత్​లో గురువారం 36,95,835 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 205.59 కోట్లు దాటింది. మరో 4,00,110 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 7,99,008 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,795 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,63,97,203కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,29,807 మంది మరణించారు. ఒక్కరోజే 8,34,923 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,65,30,925కు చేరింది.

  • జపాన్​లో 2,31,597 కేసులు నమోదు కాగా.. 157 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో తాజాగా 1,07,849 కేసులు నమోదు కాగా.. 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో 86,309 కేసులు నమోదయ్యాయి. 311 మంది మరణించారు.
  • ఇటలీలో కొత్తగా 42,959 మందికి కరోనా సోకింది. 161 మంది బలయ్యారు.
  • ఆస్ట్రేలియాలో తాజాగా 37,261 మందికి కొవిడ్ సోకగా.. 85 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి : భారత్​లో ఎన్ని కోట్ల వాహనాలు ఉన్నాయో తెలుసా?

దేశవ్యాప్తంగా 4.24 కోట్ల కేసులు పెండింగ్‌.. సుప్రీంలోనే 71వేలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.