కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజే 19వేల కేసులు.. అమెరికాలో లక్షకు పైగా..

author img

By

Published : Aug 4, 2022, 9:37 AM IST

covid-cases-in-india

Covid Cases In India: భారత్​లో కొవిడ్​ కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. తాజాగా 19,893 మంది వైరస్ బారిన పడగా.. 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, జపాన్, అమెరికా, దక్షిణ కొరియా​ దేశాల్లో లక్షకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి.

Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య 19,893 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 4.94శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 20,419 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.31శాతంగా ఉన్నాయి.

  • మొత్తం కేసులు : 4,40,19,811
  • మొత్తం మరణాలు: 5,26,530
  • యాక్టివ్​ కేసులు: 1,36,478
  • కోలుకున్నవారి సంఖ్య: 4,34,24,029

Vaccination India:
భారత్​లో బుధవారం 38,20,676 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 205.22 కోట్లు దాటింది. మరో 4,03,006 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు అధికంగానే నమోదయ్యాయి. కొత్తగా 8,29,153 మంది వైరస్​ బారినపడగా.. మరో 2,054 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,50,41,290కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,27,389 మంది మరణించారు. ఒక్కరోజే 10,11,506 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,14,32,758కు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.