భారత్​లో భారీగా తగ్గిన కొవిడ్ కేసులు.. జపాన్​లో 2లక్షలపైనే!

author img

By

Published : Aug 1, 2022, 9:14 AM IST

covid cases in india

Covid Cases In India: భారత్​లో కొవిడ్​ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 16,464 మంది వైరస్ బారిన పడగా.. 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు జపాన్​లో కొత్తగా 2.12 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం మధ్య 16,464 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 16,112 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు : 4,40,36,275
  • మొత్తం మరణాలు: 5,26,396
  • యాక్టివ్​ కేసులు: 1,43,989
  • కోలుకున్నవారి సంఖ్య: 4,33,65,890

Vaccination India: భారత్​లో ఆదివారం 8,34,167 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 204.34 కోట్లు దాటింది. మరో 2,73,888 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 5,79,258 మంది వైరస్​ బారినపడగా.. మరో 816 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,20,96,907కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,19,731 మంది మరణించారు. ఒక్కరోజే 6,55,167 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,21,65,705కు చేరింది.

  • జపాన్​లో 2,12,960 కేసులు నమోదు కాగా.. 91 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో తాజాగా 73,589 కేసులు నమోదు కాగా.. 20మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో కొత్తగా 36,966 మందికి కరోనా సోకింది. 83 మంది బలయ్యారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 31,535 మందికి వైరస్​ సోకింది.
  • ఆస్ట్రేలియాలో తాజాగా 30,930 మందికి కరోనా సోకింది. 41 మంది మరణించారు.

ఇవీ చదవండి: ముష్కరుల తూటాలకు బెదరని శునకం.. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం

ఘోరం.. కరెంట్​ షాక్​తో 10 మంది మృతి.. వ్యాన్​లోని డీజే సిస్టమ్​ వల్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.