దేశంలో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు.. జపాన్​లో 2 లక్షలకుపైనే..

author img

By

Published : Jul 31, 2022, 9:48 AM IST

covid cases in india

Covid Cases In India: భారత్​లో కొవిడ్​ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 19,673 మంది వైరస్ బారిన పడగా.. 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు జపాన్​లో కొత్తగా 2.21 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం మధ్య 19,673 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 19,336 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు : 4,40,19,811
  • మొత్తం మరణాలు: 5,26,357
  • యాక్టివ్​ కేసులు: 1,43,676
  • కోలుకున్నవారి సంఖ్య: 4,33,49,778

Vaccination India: భారత్​లో శనివారం 31,36,029 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 204.25 కోట్లు దాటింది. మరో 3,96,424 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 6,63,559 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,154 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,14,58,226కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,18,751 మంది మరణించారు. ఒక్కరోజే 7,35,044 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,14,32,758కు చేరింది.

  • జపాన్​లో 2,21,938 కేసులు నమోదు కాగా.. 130 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో తాజాగా 81,944 కేసులు నమోదు కాగా.. 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో కొత్తగా 49,571 మందికి కరోనా సోకింది. 121 మంది బలయ్యారు.
  • ఆస్ట్రేలియాలో తాజాగా 49,157 మందికి కరోనా సోకింది. 135 మంది మరణించారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 41,274 మందికి వైరస్​ సోకింది.

ఇదీ చూడండి : 'అత్యాచార కేసుల్లో డీఎన్‌ఏ టెస్ట్​.. తిరుగులేని సాక్ష్యం కాదు'

రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు.. భారీ నగదుతో చిక్కిన ఎమ్మెల్యేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.