మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు.. 17 వేలకు పైగా..

author img

By

Published : Aug 3, 2022, 9:44 AM IST

Updated : Aug 3, 2022, 10:00 AM IST

covid cases in india

Covid Cases In India: భారత్​లో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 17,135 మంది వైరస్ బారిన పడ్డారు. 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు జపాన్​లో కొత్తగా 1.67 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం మధ్య 17,135 మందికి వైరస్​ నిర్ధరణ కాగా..మరో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 19,823 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.49 శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు : 4,40,67,144
  • మొత్తం మరణాలు: 5,26,477
  • యాక్టివ్​ కేసులు: 1,37,057
  • కోలుకున్నవారి సంఖ్య: 4,34,03,610

Vaccination India: భారత్​లో మంగళవారం 23,49,651 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 204.84 కోట్లు దాటింది. మరో 4,64,919 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 8,21,908 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,938 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 583,944,874 కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,18,751 మంది మరణించారు. ఒక్కరోజే 1,087,782 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 554,463,913కు చేరింది.

  • జపాన్​లో 167,678 కేసులు నమోదు కాగా.. 109 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో తాజాగా 111,700 కేసులు నమోదు కాగా..16 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో కొత్తగా 64,861 మందికి కరోనా సోకింది. 190 మంది బలయ్యారు.
  • జర్మనీలో తాజాగా 87,681 మందికి కరోనా సోకింది. 210 మంది మరణించారు.
  • అమెరికాలో కొత్తగా 61,162 మందికి వైరస్​ సోకింది.

ఇదీ చూడండి : 'అత్యాచార కేసుల్లో డీఎన్‌ఏ టెస్ట్​.. తిరుగులేని సాక్ష్యం కాదు'

రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు.. భారీ నగదుతో చిక్కిన ఎమ్మెల్యేలు

Last Updated :Aug 3, 2022, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.