'అలాంటి వారికి ముందస్తు బెయిల్ ఉండదు'

author img

By

Published : Oct 11, 2021, 4:05 PM IST

Supreme Court

దర్యాప్తు సంస్థలకు సహకరించకుండా తప్పించుకుని తిరిగే నిందితులను ధర్మాసనాలు కాపాడలేవని సుప్రీంకోర్టు (Supreme Court News) స్పష్టం చేసింది. 2017 అల్లర్ల కేసులో ఓ నిందితుడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే నిందితులను ఉద్దేశించి సుప్రీంకోర్టు(Supreme Court News) ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు, విచారణ సంస్థలకు సహకరించకుండా తప్పించుకుని తిరిగే వారిని కోర్టులు రక్షించలేవని, వారికి ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది.

2017 యూపీ అల్లర్ల కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్​ను 2019లో అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు(Supreme Court On anticipatory bail) ఈ వ్యాఖ్యలు చేసింది.

" దర్యాప్తు సంస్థలకు సహకరించకుండా తప్పించుకుని తిరిగే నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వలేం. వారిని కాపాడలేం."

-- సుప్రీం ధర్మాసనం

2017, ఉత్తర్​ప్రదేశ్​లోని బలియా జిల్లాలో జరిగిన అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి.. ముందస్తు బెయిల్ కోసం 2019లో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే.. సదరు వ్యక్తి 30 రోజుల్లోగా హైకోర్టు ముందు హాజరుకావాలని, ఆ తర్వాత బెయిల్​కు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది.

అయితే.. ఆ నిందితుడు గడువులోగా కోర్టు ముందు హాజరుకాలేదు. దీంతో అతనికి ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ.. అలహాబాద్ ధర్మాసనం తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్​ చేస్తూ.. సుప్రీంకోర్టును(Supreme Court Judgement) ఆశ్రయించాడు.

ఇదీ చదవండి: 'సాహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్.. మోదీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.