దేశంలో స్థిరంగా కొవిడ్​ కేసులు.. కొత్తగా 5 వేల మందికి కరోనా

author img

By

Published : Sep 23, 2022, 9:36 AM IST

Corona Cases in India

Corona Cases in India : భారత్​లో కరోనా కేసులు స్థిరంగా నమోదయ్యాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 5,383 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది.

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు సంఖ్య స్థిరంగా ఉంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 5,383 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 20 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,45,58,425
  • మరణాలు: 5,28,449
  • యాక్టివ్ కేసులు: 45,281
  • రికవరీలు: 4,39,84,695

Vaccination In India :
దేశంలో గురువారం 14,91,017 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 217.26 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,20,187 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 4,21,809 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,170 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,90,65,131కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,36,520 మంది మరణించారు. మరో 5,85,275 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,89,34,274కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 61,478 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 120 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో కొత్తగా 53,457 కేసులు వెలుగుచూశాయి. మరో 106 మంది మరణించారు.
  • జర్మనీలో 50,800 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 93 మంది మృతి చెందారు.
  • తైవాన్​లో 42,470 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో 38,598 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 222 మంది మృతి చెందారు.

ఇవీ చదవండి: నదిలో బోల్తా పడ్డ స్కూల్​ విద్యార్థుల బోటు.. ఒక్కసారిగా 25 మంది పిల్లలు!

అమ్మవారి విగ్రహాన్ని తాకాడని దళిత బాలుడికి రూ.60 వేలు జరిమానా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.