దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

author img

By

Published : Sep 19, 2022, 9:45 AM IST

Corona Cases in India

Corona Cases in India : భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 4,858 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 4,735 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 4,858 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 18 మంది చనిపోయారు. ఒక్కరోజులో 4,735 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.11 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,45,39,046
  • మరణాలు: 5,28,355
  • యాక్టివ్ కేసులు: 48,027
  • రికవరీలు: 4,39,62,664

Vaccination In India : దేశంలో ఆదివారం 13,59,361 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,16,70,14,127 కోట్లకు చేరింది. ఒక్కరోజే 1,75,935 కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 2,86,688 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 549 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,71,79,605 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,30,741 మంది మరణించారు. మరో 4,22,781 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,67,28,090 కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 69,731 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 139 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో 56,751 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 101మంది మృతి చెందారు.
  • తైవాన్​లో 39,569 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 39 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియాలో కొత్తగా 34,764 కేసులు వెలుగుచూశాయి. మరో 46 మంది మరణించారు.

ఇవీ చదవండి: కళ్లు ఆర్పిన హనుమంతుడు.. కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం!

సిటీ బస్సులో భారీగా మంటలు.. లోపల 12 మంది ప్రయాణికులు.. చివరకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.