దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 1.95 లక్షల మందికి వైరస్
Updated on: Jan 12, 2022, 9:48 AM IST

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 1.95 లక్షల మందికి వైరస్
Updated on: Jan 12, 2022, 9:48 AM IST
Corona cases in India: దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 1,94,720 లక్షల మందికి వైరస్ సోకింది. కరోనా ధాటికి మరో 442 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగింది.
Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 1,94,720 మంది వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ కారణంగా మరో 442 మంది మరణించారు. 60,405 మంది వైరస్‌ను జయించారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 3,60,70,510
- మొత్తం మరణాలు: 4,84,655
- యాక్టివ్ కేసులు: 9,55,319
- మొత్తం కోలుకున్నవారు: 3,46,30,536
Omicron Cases In India
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 85,26,240 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,53,80,08,200కు చేరింది.
అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే 27,72,068 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 7,847 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసులు 31,41,01,581.. మరణాలు 55,21,038కి చేరాయి.
- అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం మరో 6,72,872 మందికి వైరస్ సోకింది. 2,173 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 6.33 కోట్లకు చేరింది.
- ఫ్రాన్స్‌లో కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 3, 68,149 కేసులు నమోదయ్యాయి. మరో 341 మంది మరణించారు.
- బ్రిటన్‌లో మరో 1,20,821 మందికి వైరస్ సోకింది. 379 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో 2,20,532 కొత్త కేసులు బయటపడగా.. 294 మంది మరణించారు.
- స్పెయిన్‌లో 1,34,942 మందికి కొత్తగా వైరస్ సోకింది. మరో 247 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: 'ఇష్టం లేని శృంగారాన్ని వద్దనే హక్కు 'ఆమె'కు ఉంటుంది'
