పార్టీ ఫిరాయింపులతో కాంగ్రెస్​కు దెబ్బ.. భాజపాకు లాభం!

author img

By

Published : Sep 10, 2021, 5:47 AM IST

party defections lose for the Congress

2014 నుంచి పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేతలే ఎక్కువగా ఉన్నట్లు అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫామ్స్​ (ఏడీఆర్​) నివేదికలో వెల్లడైంది. ఏడేళ్ల కాలంలో మొత్తం 222 మంది ఎలక్టోరల్ క్యాండిడేట్లు ఆ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరినట్లు వెల్లడించింది.

గత ఏడేళ్లలో ఫిరాయింపుల కారణంగా అత్యధికంగా నష్టపోయిన రాజకీయ పార్టీ కాంగ్రెసేనని ఏడిఆర్​(అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్​ రీఫామ్స్​) నివేదిక వెల్లడించింది. 2014లో కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత.. కమలదళంలోకి భారీ సంఖ్యలో ఇతర పార్టీల నేతలు చేరినట్లు ఈ నివేదిక వివరించింది.

నివేదిక ప్రకారం.. ఏడేళ్ల కాలంలో మొత్తం 222 మంది ఎలక్టోరల్ క్యాండిడేట్లు కాంగ్రెస్​ను వీడి ఇతర పార్టీల్లో చేరారు. 2014 నుంచి 2021 మధ్య జరిగిన వివిధ ఎన్నికల సమయంలో.. 177 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ను విడారు.

ఇదే సమయంలో 111 ఎలక్టోరల్ క్యాండిడేట్లు భాజపాను వీడగా.. 2014 నుంచి జరిగిన వివిధ ఎలక్షన్ల సమయంలో 33 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్లిపోయినట్టు తేలింది. భాజపాలోకి 253 మంది ఎలక్టోరల్ క్యాండిడేట్లు చేరారు. అందులో 173 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

మొత్తం మీద గత ఏడేళ్లకాలంలో 399 మంది కీలక నేతలు కాంగ్రెస్​ను వీడినట్లు నివేదికలో వెల్లడైంది. ఇదే సమయంలో ఇతర పార్టీల నుంచి 115 క్యాండిడేట్లు, 61 ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ పార్టీలోకి వచ్చారు.

అన్ని పార్టీలకు కలిపి 2014 నుంచి ఇప్పటి వరకు.. మొత్తం 1133 మంది క్యాండిడేట్లు.. 500 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్​ రీఫామ్స్​ ద్వారా తెలిసింది.

కాంగ్రెస్​ తర్వాత...

  • పార్టీల పరంగా చూస్తే.. కాంగ్రెస్​ తర్వాత అత్యధికంగా నేతలను కోల్పోయిన పార్టీగా బహుజన్ సమాజ్​ పార్టీ (బీఎస్పీ) నిలిచింది. ఈ పార్టీ మొత్తం 153 మంది కీలక నేతలు, 20 మంది చట్ట సభ్యులను కోల్పోయింది. ఇదే సమయంలో 65 మంది కీలక నేతలు.. 12 మంది చట్ట సభ్యులు బీఎస్​పీలోకి చేరారు.
  • 2014 నుంచి ఇప్పటి వరకు సమాజ్​వాది పార్టీ (ఎస్పీ) 60 మంది నేతలను.. 18 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను కోల్పోయింది. కొత్తగా 29 మంది కీలక నేతలు, 13 మంది చట్ట సభ్యులు ఎస్పీలో చేరారు.
  • తృణమూల్​ కాంగ్రెస్​ (టీఎంసీ) కూడా గత ఏడేళ్ల కాలంలో 31 మంది క్యాండిడేట్లను.. 26 మంది చట్టసభ్యులను కోల్పోయింది. అయితే ఇదే కాలానికి 23 మంది క్యాండిడేట్లు, 31 మంది చట్ట సభ్యులు టీఎంసీ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం.
  • జనతా దల్​-జేడీయూ (జేడీ-యూ) కూడా 2014-2021 మధ్య 59 మంది క్యాండిడేట్లను కోల్పోయింది. ఏడేళ్లలో ఇతర పార్టీల నుంచి 23 మంది క్యాండిడేట్లు.. 12 మంది చట్ట సభ్యులు జేడీ-యూలో చేరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.