మోదీ టూర్​: గిన్నిస్​ రికార్డులతో మోతెక్కనున్న ప్రయాగ్​రాజ్​

author img

By

Published : Feb 29, 2020, 6:05 AM IST

Updated : Mar 2, 2020, 10:26 PM IST

PM Modi to visit UP

ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​ ఐదు అరుదైన గిన్నిస్​ రికార్డులకు వేదికగా నిలవనుంది. వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన ప్రత్యేక ఉపకరణాలు పంపిణీ చేసేందుకుగానూ అక్కడి పరేడ్​గ్రౌండ్​లో భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.

మోదీ టూర్​: గిన్నిస్​ రికార్డులతో మోతెక్కనున్న ప్రయాగ్​రాజ్​

నేడు ఉత్తర్​ప్రదేశ్​లో తీరిక లేకుండా గడపనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని.. కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. సామాజిక సాధికారత, రైతుల సంక్షేమం అంశాలపై మాట్లాడనున్నారు.

ఉదయం 11 గంటలకు ప్రయాగ్​రాజ్​లో 'సామాజిక్​ అధికారిత శివిర్​'(సామాజిక సాధికారిత శిబిరం)కు శ్రీకారం చుట్టనున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన ప్రత్యేక ఉపకరణాలను అందజేసేందుకు.. అక్కడి పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించనున్న భారీ కార్యక్రమానికి హాజరుకానున్నారు మోదీ.

ఈ సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​ ఐదు అరుదైన గిన్నిస్​ రికార్డులకు వేదికగా నిలవనుంది. ఒకే ప్రదేశంలో అధిక సంఖ్యలో ప్రత్యేక ఉపకరణాలు పంపిణీ, చక్రాల కుర్చీలతో అత్యంత పొడవైన వరుసను ఏర్పాటు చేయడం సహా మొత్తం 5 అంశాల్లో గిన్నిస్​ రికార్డులకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచే అవకాశముంది.

రాష్ట్రీయ వయోశ్రీ యోజన(ఆర్​వీవై) కిందకు వచ్చే సీనియర్​ సిటిజన్లు, దివ్యాంగుల కోసం నిర్వహించే అతిపెద్ద కార్యక్రమంగా దీనిని పేర్కొంటూ ట్వీట్​ చేశారు ప్రధాని.

ఎఫ్​పీఓల ప్రారంభం...

'ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి' కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా 10 వేల వ్యవసాయ ఉత్పత్తి సంఘాలను(ఎఫ్​పీఓ) నేడు ప్రారంభించనున్నారు ప్రధాని. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు, భూమిలేని రైతులకు ఈ ఎఫ్​పీఓ పథకం ఉపయోగపడుతుందన్నారు.

మధ్యాహ్నం... బుందేల్​ఖండ్​ ఎక్స్​ప్రెస్​వేకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దేశ రాజధానిని అనుసంధానం చేసే ఈ మార్గంతో బుందేల్​ఖండ్​ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు మోదీ. ముఖ్యంగా చిత్రకూట్​, బాంద్రా, మాహోబా, హమిర్ పుర్​, జాలౌన్​, ఇటావా స్థానికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ట్వీట్​ చేశారు.

Last Updated :Mar 2, 2020, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.