కూతురిపై 32 ఏళ్లుగా రేప్!.. 11 ఏళ్ల వయసులోనే దారుణం.. వివాహమైనా వదలకుండా..

author img

By

Published : Sep 17, 2022, 3:27 PM IST

Aligarh Rape Case Filed After 32 Years

కూతురి సమానురాలైన అమ్మాయిపై సుమారు 32 ఏళ్లుగా బెదిరించి బలాత్కారానికి పాల్పడుతున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చి ఓ బాలికతో అసాంఘిక కార్యకలాపాలు చేయించిన ఘటన హరియాణాలో జరిగింది.

Aligarh Rape Case Filed After 32 Years : నాన్న తర్వాత నాన్నంతటి వాడు చిన్నాన్న! అలాంటి వ్యక్తే కూతురు సమానురాలైన అమ్మాయిపై సుమారు 32 ఏళ్ల నుంచి బెదిరించి బలత్కారానికి పాల్పడుతున్నాడు. ఈ దుశ్చర్య మొదలైనప్పుడు ఆ పాప వయసు 11 ఏళ్లు. లోకం పోకడలు అంతగా ఎరుగని ఆ పాపపై తన ఇంట్లో వారే బలాత్కారానికి పాల్పడితే ఆ మాట ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తానే కుమిలిపోయేది.

ఆఖరికి ఆమెకు పెళ్లయ్యాక అయినా ఈ బాధనుంచి విముక్తి లభిస్తుందని ఆశ పడింది. కానీ అలా జరగలేదు. పుట్టింటికి చుట్టం చూపుగా వెళ్లినప్పుడు మళ్లీ ఆ కామాంధుడు ఆమెను బలవంతపెట్టేందుకు ప్రయత్నించాడు. ఈసారి ధైర్యం చేసి తిరగబడితే దాని ఫలితం ఆమెకు దెబ్బల రూపంలో దక్కింది. ఈ విషయాన్ని బయటపెడితే తన భర్తకు చెప్తామని బెదిరించడం వల్ల ఆమె నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె బాధను తెలుసుకుందామని తన భర్త ఆమెతో మాట్లాడగా అసలు విషయం బయటపెట్టింది. విషయం విన్న భర్త ఆమెకు భరోసా ఇచ్చి కంప్లైంట్​ చేయమని ప్రోత్సహించాడు. దీంతో ఆ దుర్మార్గుడి అరాచకాలకు అడ్డు చేప్పినట్లు అయ్యింది.

అసలేం జరిగిందంటే:
ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​కు చెందిన ఓ మహిళ తనపై గత 32 ఏళ్లుగా తన ఇంట్లోని ఓ వ్యక్తి బలాత్కారానికి పాల్పడుతున్నాడని అలీగఢ్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. తన చిన్నాన్నే ఈ దారుణానికి ఒడిగట్టాడని కంప్లైంట్ ఇచ్చారు. 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. ఆ క్రమంలో తనకు కడుపు నొప్పి వచ్చిందని.. తల్లికి చెప్తే ఆమె ఓ మాత్ర ఇచ్చి ఊరుకోమందని వివరించింది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు ఇదే అదునుగా చేసుకుని దాదాపు ఆ అమ్మాయికి పెళ్లయ్యేంతవరకు ఇలానే ప్రవర్తించేవాడు.

కాగా, 2011లో ఆ యువతికి అలిగఢ్​లోని ఓ జవాన్​తో వివాహం జరిగింది. వివాహం తరువాత అంతా సజావుగా సాగుతుందని అనుకున్న ఆ బాధితురాలికి నిరాశే ఎదురైంది. పుట్టింటికి వెళ్తావా అని భర్త అడిగిన ప్రతి సారి ఆమె భయంతో నిరాకరించేది. 2019లో ఓసారి తన సోదరుడితో కలిసి ఇంటికి వెళ్లగా.. వాళ్ల చిన్నాన్న మళ్లీ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈసారి ఆమె ఓర్చుకోకుండా తిరగబడింది. దాంతో ఆమెను కొట్టి ఆ తర్వాత బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తన భర్తపై తప్పుడు కేసులు బనాయించి అతన్ని జైలుపాలు చేస్తామన్నారు. దీంతో భయపడ్డ బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికి తెలియనివ్వలేదు.

ప్రస్తుతం తన భర్త వీఆర్​ఎస్​ తీసుకుని అలీగఢ్​లో వ్యాపారం చేస్తున్నాడు. తన భర్తకు జరిగిందంతా చెప్పగా ఆయన అండగా నిలుస్తానని ధైర్యం చెప్పడం వల్ల ఆమె భర్త సహాయంతో ఐజీఆర్​ఎస్​ పోర్టల్​లో కంప్లైంట్​ నమోదు చేసింది. అధికారులకు లేఖలు సైతం రాశారు. లేఖల ఆధారంగా అలీగఢ్​ పోలీసులు బన్నాదేవి పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు చేసుకున్నారు.

గురుగ్రామ్​లో బలవంతంగా..
గురుగ్రామ్​లో మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాలికకు ఉద్యోగం ఇప్పిస్తానని మభ్యపెట్టిన మహిళ తనతో అసాంఘిక కార్యకలాపాలు చేయించేదని బాధితురాలు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు 'స్పా'ను నడిపిస్తున్న యజమానిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. దిల్లీకి చెందిన 14 ఏళ్ల బాలికకు ఆగస్టులో ఓ మహిళ పరిచయమయ్యింది. ఆమె గురుగ్రామ్​లోని సోహ్నా రోడ్డులోని ఓ స్పా సెంటర్​ నిర్వహిస్తోంది. బాధిత బాలికకు రిసెప్షనిస్ట్​ ఉద్యోగం ఇప్పిస్తానని నిందితురాలు ఆశ పెట్టింది. సరే అన్న బాలిక ఆ ఉద్యోగంలో చేరింది. ఉద్యోగంలో చేరిన మొదటిరోజు ఆ స్పాకు ఓ యువకుడు మసాజ్​ చేయించుకునేందుకు వచ్చాడు. ఆ సమయంలో ఈ బాలికను అతని రూంలోకి బలవంతంగా నెట్టేందుకు ప్రయత్నించారు. అందుకు నిరాకరించినప్పటికీ.. ఆమెను బలవంతంగా నెట్టేశారు. రూం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ బాలిక ఇక ఉద్యోగం మానేస్తానని చెప్పగా, అదే స్పాలో ఉన్న ఓ యువకుడు తన అశ్లీల వీడియోలను బయటపెడతానని, గ్యాంగ్​ రేప్​ చేసి చంపేస్తామని బెదిరించాడని బాలిక తెలిపింది.

ఇక చేసేదేమి లేక ఉద్యోగంలో కొంత కాలం కొనసాగింది. రోజూ ఆమెపై దాదాపు 15మంది అత్యాచారానికి పాల్పడేవారని.. ఆ బాధ భరించలేక అక్కడి నుంచి బయటకు వచ్చానని పోలీసులకు తెలిపింది. విషయం విన్న పోలీసులు ఆమె స్టేట్​మెంట్​ ఆధారంగా తీసుకుని వేర్వేరు సెక్షన్లతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: ప్రేయసిపై 20 కత్తిపోట్లు.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని..

రాహుల్ పాదయాత్రకు విరాళాల కోసం దారుణం.. కూరగాయల వ్యాపారిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.