జమ్ముకశ్మీర్​లో వరదలు.. చిక్కుకున్న 11 మంది పర్యటకులు

author img

By

Published : Jun 22, 2022, 6:21 PM IST

Updated : Jun 22, 2022, 7:54 PM IST

jammu kashmir flood

Jammu Kashmir floods: జమ్ముకశ్మీర్​లో వరదలు సంభవించాయి. పహల్​గామ్​లో 11మంది పర్యటకులు, ఇద్దరు టూరిస్ట్ గైడ్​లు వరదల్లో చిక్కుకున్నారు. భారీ వర్షాల ధాటికి పలు జాతీయ రహదారులు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

Jammu Kashmir floods: జమ్ముకశ్మీర్​లో అకస్మికంగా సంభవించిన వరదల వల్ల పర్యటక ప్రాంతమైన పహల్​గామ్​లో 11 మంది సందర్శకులు, ఇద్దరు టూరిస్ట్ గైడ్‌లు వరదల్లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. ఒకరు వరదల్లో కొట్టుకుపోయారని పేర్కొన్నారు. వీరు టార్సర్​ మార్సర్ సరస్సు సమీప ప్రాంతాన్ని సందర్శిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టింది. టార్సర్ మార్సర్ అనేవి రెండు సరస్సులు. ఇవి త్రాల్, పహల్​గామ్, శ్రీనగర్ పర్వత ప్రాంతాల్లో ఉన్నాయి. అమర్​నాథ్ ఆలయం సమీపంలోనే పహల్​గామ్​ ఉంది. కొండను ఎక్కి ఈ ప్రాంతాన్ని చేరుకుంటారు.

వరదల ధాటికి పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. ఈ అంతరాయం వల్ల వందలాది వాహనాలు రోడ్డు మీద నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. పూంచ్, రాజౌరి జిల్లాలను షోపియాన్ జిల్లాతో కలిపే మొఘల్ రహదారిపై కూడా కొండచరియలు విరిగిపడడం వల్ల రహదారిని మూసేశారు అధికారులు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

jammu kashmir flood
వరదలకు కొట్టుకుపోయిన జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారి

రోడ్డును మూసేయడం వల్ల హైవేపై చిక్కుకున్న ప్రయాణికులకు ఆహారం, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పలు చోట్ల రోడ్లుపై బురద, మట్టి పేరుకుపోవడం వల్ల రెస్క్యూ టీం వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది.

ఇవీ చదవండి: మహిళపై సజీవ దహనానికి విఫలయత్నం.. నాలుక కోయాలని ప్రయత్నించి..

12 ఏళ్ల బాలికకు బలవంతంగా రెండు పెళ్లిళ్లు.. గర్భం దాల్చాక!

Last Updated :Jun 22, 2022, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.