'డబ్బులిస్తామని తీసుకొచ్చి ఎండలో ఇబ్బంది పెట్టారు' - వైఎస్సార్సీపీపై మహిళల ఆగ్రహం - VISAKHA STEELPLANT ACCIDENT VICTIMS
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 11, 2026 at 1:59 PM IST
Visakha Steel Plant Tragedy Turned Into Political Stage By YSRCP Leaders: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితుల పరామర్శకు జగన్ వచ్చిన సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా జనసమీకరణ చేశారు. మహిళలకు డబ్బులు ఇచ్చి మరీ వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలించారు. 100 రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకొచ్చి ఎండలో ఇబ్బందులు పెడుతున్నారని మహిళలు వాపోయారు. కనీసం తాగేందుకు చుక్క మంచి నీరు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్ బాధితులకు, తమకు ఎలాంటి సంబంధం లేదని మహిళలు చెబుతున్నారు. డబ్బులు ఇస్తామని చెప్పడంతో వచ్చామని అంటున్నారు.
స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్‌తో కార్యకర్తలు భారీగా తరలిరావడంతో అల్లిపురం, డాబాగార్డెన్స్, జైల్‌రోడ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను జగన్ పరామర్శించారు. అయితే ఆస్పత్రిలో ఉన్నామన్న విషయం మరిచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఈలలు, కేకలతో హడావుడి చేశారు.